తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని అధిష్టానం ప్రకటించింది. అయితే ప్రకటన వచ్చిన కాసేపటికే మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏఐసీసీ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి శనివారం రాత్రి లేఖ పంపారు.ఇక టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డి.. పార్టీలో చిన్ని చిన్న విభేదాలు సహజమేనని.. అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివిధ కమిటీల నియమాకంపై అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.. ప్రచారాలు జోరుగా సాగుతున్నా.. రేపో, మాపో అంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం ఊరిస్తూనే ఉంది.. తాజా పరిణామాలు చూస్తుంటే.. లిస్ట్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది.. తెలంగాణలో కాంగ్రెస్ బాధ్యుల నియామకానికి అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతా మోగ్లి ముదిరాజ్‌ను నియమించింది అధిష్టానం.. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి…
కాంగ్రెస్‌లో వాళ్లిద్దరూ.. మంచి మిత్రులు. రాజకీయంగా కలిసి పనిచేస్తున్నారు. ఒకరికోసం ఇంకొకరు సాయం చేసుకుంటారు కూడా. ఓ కీలక విషయంలో మాత్రం ఆ ఇద్దరిలో ఒకరు మధ్యలోనే కాడి పడేశారు. రేస్‌లో లేనని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారట. ఇంతకీ ఎవరా మిత్రులు? ఏంటా విషయం? ఒకరికోసం ఒకరు సాయం చేసుకుంటారు తెలంగాణ PCC చీఫ్ పోస్ట్ కోసం నాయకులు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ పలుకుబడి ఉన్నవాళ్లు సొంతంగా.. అధిష్ఠానం దగ్గరకు వెళ్లడానికి ఇబ్బంది పడేవారూ..…
పిసిసి నియామకంపై మాజీ మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. పిసిసి అనేది ఏఐసీసీ పరిధిలోని అంశమని.. నేను పిసిసి రేసులో లేనని పేర్కొన్నారు. తనకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు.. ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. పిసిసి ఎవరికి ఇవ్వాలన్నది ఏఐసీసీకి తెలుసు అని తెలిపారు. అంతకు ముందు భూముల అమ్మకంపై కెసిఆర్ సర్కార్ పై శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. ప్రజల సంపదని..ప్రభుత్వం అమ్మాలని చూస్తుందని.. 30 వేల ఎకరాలను అమ్ముకోవాలని వేలం…
టీఆర్ఎస్‌కు ఇప్పటికే రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్.. ఇవాళ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడం.. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆమోదించడం జరిగిపోయాయి.. ఈ నెల 14వ తేదీన బీజేపీలో చేరనున్న ఆయన.. నైతిక బాధ్యత వహిస్తూ.. టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. దీంతో.. కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది.. ఈటల రాజీనామా వ్యవహారంపై స్పందించిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.. పార్టీ మారుతున్నఈటల నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే…
తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో.. కసరత్తు ప్రారంభించిన కాంగ్రెస్ అధిష్టానం.. ఓ నిర్ణయానికి వచ్చి.. పీసీసీ, ఇతర కమిటీలపై ప్రకటన చేసే సమయానికి.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు వచ్చాయి.. ఉప ఎన్నికలు ముగిసేవరకు పీసీసీ ప్రకటన వాయిదా వేయాలంటూ సీనియర్ నేత జానారెడ్డి విజ్ఞప్తిపై ప్రకటన వాయిదా వేసింది అధిష్టానం.. ఎన్నికలు ముగిసిపోయినా.. దీనిపై ప్రకటన రాకపోగా.. పదవులకోసం మళ్లీ లాబియింగులు మొదలయ్యాయి.. తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ నియామక…
పార్టీ ఫెల్యూర్ పై చర్చ జరపాలని ఇంచార్జ్ మాన్నికమ్, సోనియా గాంధీకి లేఖ రాసారు వీ.హనుమంతరావు. అందులో అధినేత్రి ముందు ఇల్లు చక్కదిద్దుకోవలని చెప్పారు. కానీ తెలంగాణ పార్టీ మాత్రం పట్టించుకోవడంలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి వరుస ఎన్నికల్లో పార్టీ ఓడిపోతున్న రివ్యూలు లేవు. నాడు కుంతియా, నేడు ఠాగూర్ రివ్యూలు చేయడం మర్చిపోయారు. పార్టీకి బిసిలు దూరం అవుతున్నారు. తెరాస ఈటల పోతే మరో బీసీ ఎల్. రమనను తీసుకుంటున్నారు. తెరాస బిసిల…
కాంగ్రెస్ ఎమ్యెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఠాగూర్ తన పైన చిన్న చూపు చూస్తున్నారని.. తెలంగాణలో బలమైన నాయకుడిగా ఠాగూర్ నన్ను గుర్తించకపోవడం నా దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. నేను పీసీసీ అడుగుతున్నా.. ఢిల్లీ చర్చలో తన పేరు లేకపోవడం దురదృష్టమన్నారు. ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలోనే బాంబే హైవే మీద కేసీఆర్ ను అడ్డగించిన చరిత్ర తనది అని.. ఇది ఠాగూర్ కు తెలువక…
కాంగ్రెస్ కి చావు లేదు… వచ్చే టోల్లు వస్తారు… పోయే వాళ్ళు పోతారు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వారం, పది రోజుల్లో పీసీసీ చీఫ్ నియామకం జరుగుతుంది. పీసీసీ చీఫ్ పదవి తప్పితే… ఏ పదవి తీసుకోను. పీసీసీ పదవి ముఖ్య మంత్రి పదవి కాదు. పీసీసీ ఇస్తే రాష్ట్రం అంతా తిరుగుతా.. లేదంటే ఉమ్మడి నల్గొండలో మెజారిటీ సీట్లు గెలిపించే బాధ్యత తీసుకుంటా అని తెలిపారు. నాకు పదవులు ముఖ్యం కాదు. రాజగోపాల్ రెడ్డితో..…
కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డిపై మరోసారి విహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపిని నాశనం చేసి.. కాంగ్రెస్ లోకి వచ్చాడని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఇతర పార్టీ ల నుండి వచ్చిన వాళ్లకు పిసిసి ఇస్తా అంటే ఎలా.. పిసిసి అయ్యాక రేవంత్ జైల్ కి పోతే..పార్టీ జైలు చుట్టూ తిరగాలా? అని ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు తనను తిట్టిన వాళ్ళు లేరు..మూడు,నాలుగు పార్టీలు మారిన వాళ్ళు తిడుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి మీద…