పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా తనను నియమించినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలిపారు అంజన్ కుమార్ యాదవ్. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంకి కృషి చేస్తా అన్నారు. బడుగు వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు. సామాన్య కార్యకర్త నుండి ఈ స్థాయి కి వచ్చా. 2004 నుండి… పార్టీ లో కీలకంగా పని చేశా . తెలంగాణ కోసం కొట్లడింది మేమే. కాబట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి వచ్చే ఎన్నికల్లో అధికారం ఇవ్వండి అర చేతిలో వైకుంఠం చూపిస్తుంది తెరాస అని తెలిపారు. ఊరురు తిరుగుతా ..పార్టీ కోసం పని చేస్తా. ప్రజల కాళ్ళు మొక్కి అయినా కేసీఆర్ అబద్దాల మాటలు విడమర్చి చెప్తాం. తెలంగాణ వద్దన్నోల్లు మంత్రి అయ్యారు . తెలంగాణ కొట్లాడిన ఎంపీలం అధికారం కి దూరం అయ్యాము బంగారు తెలంగాణ… ఇప్పుడు అప్పుల తెలంగాణ అయ్యింది అని పేర్కొన్నారు.