దీక్ష దీవాస్ పేరుతో బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించి ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత సీఈఓకు ఫీర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిన్న కేటీఆర్ దీక్ష దివాస్ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునివ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే.. అందుకే సీఈఓకి ఫిర్యాదు చేశామన్నారు. ‘రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా? అనే అనుమానం కలుగుతోంది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి సైలెన్స్ పిరియాడ్ కొనసాగుతోంది. ఎన్నికలకు సంబంధించి…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై కేంద్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు అందింది. ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లఘించినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్‌కు కాంగ్రెస్ నేత, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ ఫిర్యాదు చేశారు. వెంటనే కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన సీఈఓను కోరారు. కాగా ఎన్నికలకు ఇంకా ఒక్క రోజు మాత్రం ఉండటంతో పార్టీలు ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి కార్యాకలాపాలు నిర్వహించకుండ రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ను…