బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై కేంద్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు అందింది. ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లఘించినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్‌కు కాంగ్రెస్ నేత, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ ఫిర్యాదు చేశారు. వెంటనే కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన సీఈఓను కోరారు. కాగా ఎన్నికలకు ఇంకా ఒక్క రోజు మాత్రం ఉండటంతో పార్టీలు ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి కార్యాకలాపాలు నిర్వహించకుండ రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ను అమలు చేశారు ఎన్నికల అధికారుల. అయితే, నేడు.. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కేసీఆర్ 2009 నవంబర్ 29న అమరణ నిరహార దీక్ష చేపట్టిన రోజు.
ఈ సందర్భంగా దీక్ష దీవాస్ పేరుతో పార్టీ ఆఫీసులో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రక్తదానం వంటి కార్యక్రమాలు చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించారని కాంగ్రెస్ ఆరోపించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలవుతున్న తరుణంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఇలాంటి కార్యకలాపాలు నిర్వహించి నిబంధనలు ఉల్లఘించారని ఆరోపిస్తూ జీ నిరంజన్ ఎన్నికల అధికారికి ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపారు. వెంటనే కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని సీఈఓను ఆయన కోరారు. కాగా ఎన్నికలకు ఒక్క రోజు ముందు కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.