IND-W vs ENG-W: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో పోరుకు టీమిండియా రెడీ అయింది. అయితే, మనం సెమీ ఫైనల్ కు చేరుకోవాలంటే ప్రతి మ్యాచ్ ఫలితం భారత్ కు కీలకం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
ENG vs IND: నేడు (జూలై 2) నుండి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0తో ముందంజలో ఉంది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు భారత్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. రెండవ టెస్ట్‌కు ముందే భారత్ తన ప్లేయింగ్ ఎలెవన్‌లో మూడు కీలక మార్పులు…
SRH vs MI: ఉప్పల్ వేదికగా ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో హై వోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ముంబై ఇండియన్స్ (MI), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా పెట్టుకోవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన కీలక పోరులో ఇరు జట్లు ఢీకొట్టనున్నాయి. ఇప్పటివరకు SRH ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలే నమోదు చేయగలిగింది. దీనితో ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో ఉంది. ఈ…
నేడు బెంగళూరు, ఆర్సీబీ మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ ఈసారి తన సొంతమైదానం ముల్లాన్‌పుర్‌లో ఈ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. పరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. బెంగళూరు లక్ష్యం 158 పరుగులు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ నంబర్-37లో భాగంగా పంజాబ్ కింగ్స్ (PBKS) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ ముల్లన్‌పూర్ (న్యూ చండీగఢ్)లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఐపీఎల్‌లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతోంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో కొనసాగనుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్షం కారణంగా పూర్తి ఆట సాధ్యం కాదు. కాబట్టి 14 ఓవర్ల చొప్పున ఇరు జట్లు పోటీ పడనున్నాయి.
MI vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జేట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), ఢిల్లీ కేపిటల్స్ (DC) మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఇక మ్యాచ్ టాస్‌లో విజయం సాధించిన ఢిల్లీ కేపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సందర్బంగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ఇప్పటివరకు నాలుగు మ్యాచుల్లో టాస్ గెలిచి మేమే నిర్ణయం తీసుకున్నామని, ఈసారి ప్రత్యర్థి నిర్ణయం తీసుకోవడం వల్ల భిన్న అనుభూతి…
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. గుజరాత్ నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. లక్నో జట్టు 6 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో రెండు జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. కాగా.. టాస్ గెలిచిన రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
SRH vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ అర్షద్ ఖాన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చింది. హర్షల్ పటేల్ అనారోగ్యం కారణంగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జయదేవ్ ఉనద్కట్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చింది. ఇక గత 3 మ్యాచ్ లలో ఘోరంగా విఫలమైన సన్‌రైజర్స్…
RCB vs GT: నేడు బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య మ్యాచ్ జరుగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రెండు జట్లు తలపడుతున్నాయి. ఇక మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుత సీజన్‌లో ఆర్‌సిబి తన సొంత మైదానంలో ఆడటం ఇదే తొలిసారి. రజత్ పాటిదార్ నేతృత్వంలోని జట్టు ఐపీఎల్ 2025 సీజన్ లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో…