SRH vs MI: ఉప్పల్ వేదికగా ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో హై వోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ముంబై ఇండియన్స్ (MI), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా పెట్టుకోవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన కీలక పోరులో ఇరు జట్లు ఢీకొట్టనున్నాయి. ఇప్పటివరకు SRH ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలే నమోదు చేయగలిగింది. దీనితో ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ప్లే ఆఫ్ రేసు నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. గెలిస్తేనే తమ ఆశలను ఉంచుకోవచ్చు.
ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టు 8 మ్యాచుల్లో 4 విజయాలను నమోదు చేసింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో 6వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే ముంబైకి ప్లే ఆఫ్స్ చేరేందుకు అవకాశాలు మెరుగవుతాయి. ఇరు జట్లకూ ఇది మిగిలిన సీజన్‌ను నిర్ణయించే మ్యాచ్‌లలో ఒకటి కావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉప్పల్‌లో అభిమానుల మధ్య జోష్ అలానే ఉండేలా ఉంది. మరి ఈ కీలక పోరులో గెలిచి ప్లే ఆఫ్ ఆశలను బతికించి పెట్టుకునే జట్టు ఏదో చూడాలి. ఇక నేడు ఆడబోయే ఇరుజట్ల ప్లేయింగ్ XI ఇలా ఉంది.
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI:
ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నామన్ ధీర్, విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, విఘ్నేష్ పుతూర్
ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్:
రోహిత్ శర్మ, కార్బిన్ బోష్, సత్యనారాయణ రాజు, రాజ్ బావా, రాబిన్ మింజ
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI:
ట్రావిస్ హెడ్స్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, ప్యాట్ కమ్మిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్, జీషాన్ అన్సారి, ఇషాన్ మాలింగ
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్స్:
అభినవ్ మనోహర్, సచిన్ బేబి, మొహమ్మద్ షమీ, రాహుల్ చాహర్, వియాన్ మల్డర్