నేడు నల్గొండ జిల్లా దామరచర్లలో పర్యటించనున్నారు. అక్కడ నిర్మితమవుతున్న యాదాద్రి ఆల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను పర్యవేక్షించనున్నారు. ఉదయం 11గంటలకు ప్రగతిభవన్ నుంచి బయల్దేరనున్న సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 12 గంటలకు దామరచర్ల చేరుకుంటారు.
టీడీపీకి మాజీ మంత్రి గంటా ఝలక్..! తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌రావు.. ఎప్పటి నుంచో ఈ ప్రచారం సాగుతున్నా.. ఫైనల్‌గా డిసెంబర్ నెలలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారట.. తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీలో చేరనున్నట్టు తన సన్నిహితుల దగ్గర గంటా శ్రీనివాస్‌రావు చర్చించినట్టుగా సమాచారం.. అయితే, పార్టీని వీడేకంటే ముందు మెగాస్టార్ చిరంజీవితో ఆయనే సమావేశం కానున్నారట.. హైదరాబాద్ వెళ్లనున్న గంటా…