మహామాయలోడు.. 21మంది యువతులను పెళ్లిచేసుకున్న నిత్యపెళ్లికొడుకు
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కొడుకును తిరువణ్ణామలైలో స్పెషల్ ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అయితే.. వివరాల ప్రకారం.. రామనాథపురం జిల్లా పరమక్కుడికి చెందిన కార్తీక్ రాజా(26) ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి. విరుదునగర్ జిల్లా సాత్తూరు సమీపంలోని వల్లంపట్టికి చెందిన జాన్సీరాణి(20)ని ఈ ఏడాది మార్చిలో వివాహం చేసుకున్నాడు. అయితే.. తమిళనాడులో కార్తీక్ రాజా 21 పెళ్ళిళ్ళు వ్యవహారం సంచలనం రేపుతోంది. పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఇంట్లో మర్యాదలు కాస్తా తగ్గినట్లు అనిపిస్తే కొత్త పెళ్ళి రెడీ అవుతున్నాడు కార్తీక్ రాజా. పెళ్ళి చేసుకున్నమా… డబ్బు, నగలతో పారిపోయామా అన్నట్లుగా ఉంది కార్తీక్ రాజా తీరు. అయితే.. 21 మంది యువతులను రకరకాల పేర్లు …. రకరకాల ఉద్యోగాలు అంటూ పెళ్ళి చేసుకున్న కార్తీక్ రాజా…. రామనాధపురం జిల్లా పరమకుడికి చెందినట్లుగా తెలుస్తోంది.
అయితే.. మార్చిలో జాన్సీరాణి అనే యువతిని పెళ్ళి చేసుకుని అమె వద్దున్న ఐదు సవరాల నగలు, నగదుతో పరారయ్యాడు కార్తీక్ రాజా. అయితే.. భర్త అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది జాన్సీరాణి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్తీక్ రాజాను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే.. పోలీసుల విచారణలో కార్తీక్ రాజా సమాధానాలు పోలీసులకు షాక్ ఇచ్చాయి. అయితే.. గతంలో 20 పెళ్లిళ్లు చేసుకున్నట్లు విచారణలో పోలీసులు తెలుసుకున్నారు. పెళ్ళి చేసుకోవడం వారి కొన్నాళ్ళు ఎంజాయ్ చేయడం పారిపోవడం చేస్తున్నట్లు, దోచుకున్న నగలతో డబ్బున్న వాడిలా కలరింగ్ ఇస్తూ మరో పెళ్ళికి పెట్టుబడిగా పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత
సీనియర్ నటుడు చలపతిరావు అలియాస్ తమ్మారెడ్డి చలపతిరావు(78)కన్నుమూశారు. తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఇతను పన్నెండు వందల పైగా సినిమాల్లో పలు రకాల పాత్రల్లో నటించాడు. కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్నారు చలపతిరావు. ఆయన స్వస్థలం కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు. నాన్న పేరు మణియ్య. అమ్మ వియ్యమ్మది పక్కనే ఉన్న మామిళ్లపల్లి . ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఆడపిల్లలు అమెరికాలో ఉంటారు. కుమారుడు రవిబాబు నటుడిగా, దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. రెండు రోజలు క్రితమే సీనియర్ నటుడు కైకాల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే మరో నటుడిని కోల్పోవడంతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. చలపతిరావు నటించిన మొదటి చిత్రం గూఢచారి 116, చివరి చిత్రం ఓ మనిషి నీవెవరు.
“అటల్” మీకు “సలాం”..
ప్రసంగించడం ఓ కళ అయితే దానికి కేరాఫ్ అడ్రస్ ఆయన. సభ ఏదైనా చమత్కారం జోడించి శ్రోతలు చూపు తిప్పుకోలేనంత అందంగా మాట్లాడే వ్యక్తి. పోఖ్రాన్ అణుప్రయోగంతో దేశాన్ని పవర్ఫుల్ గా తీర్చిదిద్ది అగ్రరాజ్యానికి మనమేం తక్కువ కాదని నిరూపించిన నాయకుడు. ఆయనే బీజేపీ నేత, స్వాతంత్ర సమరయోధులు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్. ఈరోజు ఆయన 98వ జయంతి.
బాలీవుడ్‌లో విషాదం.. షూటింగ్ సెట్‌లోనే నటి ఆత్మహత్య..!
బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. మరాఠీ టీవీ నటి తునీషా శర్మ(21) ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటుచేసుకుంది. తనీషా సీరియల్ షూటింగ్ సెట్‌లో టాయిలెట్‌కి వెళ్లి బయటకు రాలేదు. తలుపులు పగలగొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై వలీవు పోలీసులు కేసు నమోదు చేశారు.ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని తెలిపారు. ఆత్మహత్యతో పాటు హత్య కోణంలోనూ కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు.
ప్రకృతి బీభత్సానికి 18 ఏళ్లు..
డిసెంబరు 26, 2004 రాత్రి, 9.1-9.3 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం ప్రపంచం ఇప్పటివరకు చూసిన అతిపెద్ద సునామీలలో ఒకటి. 30 మీటర్ల ఎత్తులో ఉన్న భారీ అలలు ఎగిసిపడడంతో ఇండోనేషియాలో తెల్లవారుజామున పుట్టిన ఆ విపత్తు ఆ దేశంతో పాటు మరికొన్ని దేశాల ప్రజలను చీకట్లోకి నెట్టేసింది. అప్పట్లో సమర్థమంతమైన వార్నింగ్ సిస్టమ్స్ లేకపోవడంతో ఏం జరుగుతుందో తెలిసేలోపే మర్చిపోలేని విషాదాన్ని మిగిల్చింది. అదే బాక్సింగ్ డే సునామీ/ఇండియన్ ఓపెన్ సునామీ. రేపటితో ఈ విషాదానికి 18 ఏళ్లు. ప్రపంచమంతా ఇంకా క్రిస్మస్ సంబరాల్లో ఉండగా అకస్మాత్తుగా వచ్చి ఈ సునామీ లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఈ విపత్తు 14 దేశాలపై ప్రభావం చూపింది. 2,27,000 మందికిపైగా చనిపోయినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇండోనేషియాలోని సుమిత్రకు పశ్చిమ తీరాన 250 కిలోమీటర్ల దూరంలో 30 మీటర్ల లోతులో పుట్టిన భూకంపం ఫలితమే ఈ విధ్వంసం.
అమెరికాలో మంచు తుఫాను బీభత్సం
క్రిస్మస్ పండుగ వేళ భయంకరమైన మంచు తుఫాను అగ్రరాజ్యమైన అమెరికాను ముంచెత్తింది. యునైటెడ్ స్టేట్స్‌లో 3,500 కిలోమీటర్ల పొడవున మంచుతుఫాను విశ్వరూపం చూపుతోంది. తూర్పు అమెరికాలో పరిస్థితి భయంకరంగా ఉంది. పెనుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు ఎక్కడికక్కడ నేలకొరుగుతున్నాయి. దాంతో అత్యధిక ప్రాంతాల్లో కరెంట్ నిలిచిపోవడంతో ప్రజల కష్టాలు పెరిగిపోయాయి. మంచు, శక్తివంతమైన ఆర్కిటిక్ గాలులతో యునైటెడ్ స్టేట్స్‌ను ముంచెత్తిన భయంకరమైన మంచు తుఫాను శనివారం 1.7 మిలియన్ల మంది ప్రజలకు విద్యుత్ లేకుండా చేసింది. 20 లక్షలకు పైగా ఇళ్లు, కార్యాలయాల్లో అంధకారం అలముకుంది.
జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. మంచు తుఫానుతో 20 కోట్ల మందికి పైగా తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఎముకలు కొరికే చలి ధాటికి జనం అల్లాడిపోతున్నారు. వాతావరణ శాఖ అనుమానించిట్టుగానే ఆర్కిటిక్ బ్లాస్ట్ కాస్తా శక్తిమంతమైన బాంబ్ సైక్లోన్‌గా రూపాంతరం చెందుతోంది. దాని దెబ్బకు చాలా రాష్ట్రాల్లో శుక్రవారం ఉష్ణోగ్రతలు మైనస్ 45 డిగ్రీల కంటే కూడా దిగువకు పడిపోయాయి. గడ్డ కట్టించే చలికి 100 కిలోమీటర్ల పై చిలుకు వేగంతో వీచే అతి శీతల గాలులు తోడయ్యాయి. ఆరు రాష్ట్రాల్లో భారీ మంచు, గాలులు, ప్రమాదకరమైన శీతల ఉష్ణోగ్రతల కారణంగా దాదాపు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
1500 కేజీల టమాటాలతో భారీ శాంతాక్లాజ్
ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ శనివారం 2022 క్రిస్మస్ సందర్భంగా ఒడిశాలోని గంజాం జిల్లా గోపాల్‌పూర్ బీచ్‌లో శాంతా క్లాజ్ ఇసుక శిల్పాన్ని రూపొందించారు. ఇసుక కళతో పట్నాయక్ “మెర్రీ క్రిస్మస్” అని రాశారు. పట్నాయక్ 27 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పు కలిగిన శాంతాక్లాజ్‌ను 1500 కిలోల టొమాటోలను ఉపయోగించి రూపొందించారు. శనివారం రాత్రి దీన్ని ఉన్నతాధికారులు ఆవిష్కరించారు. ఇసుక, టమాటాలతో 27 అడుగుల ఎత్తున దీనిని తీర్చిదిద్దామని, 15 మంది శిష్యులు సహకరించారని సుదర్శన్ పట్నాయక్ వివరించారు. దీనిని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు పంపుతున్నట్లు చెప్పారు.