నేడు ఒడిశాలో ప్రధాని మోడీ, యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం.. ఒడిశాలో నాలుగు దశల ఎన్నికలలో మూడు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు చివరి దశ ఓటింగ్ జూన్ 1న జరగనుంది. ఇక, ఈ దశ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఒడిశాకు వెళ్తున్నారు. మూడు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు గోలక్ మహపాత్ర వెల్లడించారు. బరిపడ, బాలాసోర్, కేంద్రపరాలలో జరిగే బహిరంగ సభల్లో ప్రధాని ప్రసంగిస్తారని చెప్పారు.…
నేడు బెంగాల్లో ప్రధాని మోడీ పర్యటన.. కోల్‌కతాలో రోడ్ షో ఏడో దశ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. ఇందులో భాగంగానే అందరికంటే ముందు నుంచే ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్న ప్రధాని పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. అందులో భాగంగానే నేడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాసత్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని అశోక్‌నగర్ తో పాటు దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బరుయ్‌పూర్‌లో జాదవ్‌పూర్…
పవన్ కల్యాణ్‌కు ప్రేమతో ఓటేశారు: నాగబాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఓటర్లంతా ప్రేమతో ఓటేశారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడంపై ప్రకటన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ అలుపెరుగని పోరాట పటిమ చూపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పవన్ అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు కృషి చేసి వారి సేవలు గుర్తిస్తామని నాగబాబు స్పష్టం చేశారు. కూటమి అభ్యర్థిగా పిఠాపురం నుంచి పవన్ ఎమ్మెల్యేగా…
నేడు కస్గంజ్‌లో అమిత్ షా, బరేలీలో సీఎం యోగి పర్యటన.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ సీనియర్ నేతలు ఇవాళ (ఆదివారం) కూడా తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాస్గంజ్, మెయిన్‌పురి, ఇటావాలో నిర్వహించే బహిరంగ సభలలో పాల్గొననున్నారు. ఆ తర్వాత సాయంత్రం కాన్పూర్‌లోని తిలక్ నగర్ ప్రాంతంలో బీజేపీ సంస్థాగత సమావేశంలో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. రాజధానిలో దారుణ హత్య.. దుకాణం పైకప్పుపై…
టర్కీలో బలమైన భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.6గా నమోదు మిడిల్ ఈస్ట్ దేశం టర్కియేలో బలమైన భూకంపం సంభవించింది. సెంట్రల్ టర్కియేలో గురువారం ఒక మోస్తరు తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. భూకంప తీవ్రత 5.6గా నమోదైంది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు రాలేదు. డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ప్రెసిడెన్సీ ప్రకారం.. రాజధాని అంకారాకు తూర్పున 450…
సీఎం జగన్‌పై దాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరం ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు విజయవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విజయవాడ నగరంలో ‘మేమంతా సిద్ధం’ రోడ్‌షో నిర్వహిస్తుండగా శనివారం రాత్రి సింగ్‌నగర్ డాబా కొట్ల రోడ్డులో రాయి తగిలి సీఎం నుదుటిపై గాయమైన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన ప్రాంతంలో అనుమానితుల కదలికలపై స్థానికుల నుంచి స్టేట్ మెంట్లు రికార్డ్ చేసిన పోలీసులు.. గత వారం రోజులుగా పదే పదే…
నేడు అనకాపల్లిలో జనసేన చీఫ్ రోడ్ షో.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా నేడు (ఆదివారం) అనకాపల్లికి రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3. 30 గంటలకు హెలికాప్టర్‌లో అనకాపల్లి డైట్ కాలేజ్ సమీపంలో గల ఒక ప్రైవేటు లేఅవుట్‌లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకోనున్నారు. అక్కడ నుంచి రింగ్ రోడ్డులో గల ఎన్టీఆర్ విగ్రహం కూడలి, చేపల బజారు, చిన్న నాలుగు రోడ్ల కూడలి, కన్యకా పరమేశ్వరి జంక్షన్, వేల్పుల…
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఉమా సత్య సాయి గద్దె అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాదిలో యునైటెడ్ స్టేట్స్‌లో భారత సంతతికి చెందిన వారు మృతిచెందడం ఇది 10వ ఘటన. అగ్ర రాజ్యంలో వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తోంది. ఉమా సత్య సాయి మరణాన్ని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ ధృవీకరించింది. అయితే ఆ విద్యార్థి ఎలా చనిపోయాడు. మృతికి గల కారణాలు..…