అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఉమా సత్య సాయి గద్దె అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాదిలో యునైటెడ్ స్టేట్స్‌లో భారత సంతతికి చెందిన వారు మృతిచెందడం ఇది 10వ ఘటన. అగ్ర రాజ్యంలో వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తోంది. ఉమా సత్య సాయి మరణాన్ని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ ధృవీకరించింది. అయితే ఆ విద్యార్థి ఎలా చనిపోయాడు. మృతికి గల కారణాలు.. అలాగే అతని వివరాలు, ఇండియాలో ఏ ప్రాంతపు వాసి అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు.
నేడు ఘజియాబాద్‌లో ప్రధాని మోడీ రోడ్ షో..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు (శనివారం) రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనుంది. బీజేపీకి ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఆయన సహరాన్‌పూర్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అలాగే, సాయంత్రం ఘజియాబాద్‌లో రోడ్ షో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఇక, పోస్టర్లు, బ్యానర్లతో రోడ్ షోకు రాకుండా పోలీసులు నిషేధం విధించారు. ఇవాళ సాయంత్రం నగరంలోని మలివాడ చౌక్ నుంచి అంబేద్కర్ రోడ్డులోని చౌదరి మోడ్ వరకు బీజేపీ అభ్యర్థి అతుల్ గార్గ్‌కు మద్దతుగా జనం పోటెత్తారు. ప్రధాని మోడీ పర్యటనలో భాగంగా భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
నేడు పల్నాడులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన
పల్నాడులో టీడీపీ అధినేత చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. జిల్లాలోని పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా క్రోసూరు, సత్తేనపల్లి బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు దాచేపల్లిలో పార్టీ నేతలతో సమావేశంకానున్నారు. పల్నాడు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులపై కసరత్తు చేయనున్నారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లాంటి అంశాలపై పార్టీ నేతలతో చర్చించనున్నారు.
ఇదిలా ఉంటే.. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం యాత్రలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్చి 30న పెన్షన్ల విషయంలో ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, కానీ పింఛన్ల విషయంలో ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోందని మండిపడ్డారు. పెన్షన్ల అంశంలో రాజకీయాలు చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని చంద్రబాబు అన్నారు. వాలంటీర్లు రాజీనామా చేయాలని వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్లపై అక్రమ కేసులు పెట్టి జీవితాలు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
సరిహద్దు దాటిన ఏనుగు.. 53 గంటల పాటు తెలంగాణలో సంచారం
కొమురం భీం జిల్లాలో సంచారం చేస్తూ అందరిని హడలెత్తించిన ఏనుగు ఎట్టకేలకు సరిహద్దు దాటింది. 53 గంటల పాటు తిరుగుతూ ప్రతి ఒక్కరికి నిద్రలేకుండా దడ పుట్టించింది. గడ్చి రోలి జిల్లా మీదుగా ప్రాణహిత దాటి.. తెలంగాణ లోని కొమురం భీం జిల్లా చింతల మానే పల్లి మండలం బూరెపల్లి గుండా ఏనుగు ప్రవేశించింది. అక్కడే శంకర్, కొండ పల్లిలో మోటారు ఆన్ చేయడానికి వెళ్లిన పోచయ్యను అనే ఇద్దరు వ్యక్తులను తొక్కి చంపింది. కేవలం 24 గంటలు గడవక ముందే ఇద్దరి ప్రాణాలు తీసింది. దీంతో పారెస్ట్ అధికారులు ఏనుగు కోసం డ్రోన్ కెమరాలతో సర్చ్ ఆపరేషన్ చేశారు. స్థానికులను అలర్ట్ చేశారు. ఎవరు పొలాలకు వెళ్లొద్దని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అమెరికాలో మరోసారి భూప్రకంపనలు
అమెరికాలో మరోసారి భూకంపం సంభవించింది. న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లో శుక్రవారం మరోసారి భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రెండో సారి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.0గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. న్యూజెర్సీలోని గ్లాడ్‌స్టోన్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం 9.7 కిలోమీటర్ల లోతులో ఉద్భవించిందని తెలిపింది. ఇక భూప్రకంపనలకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ ప్రకంపనలకు పలు నివాసాలు కుదుపులకు గురయ్యాయి.
అమెరికాలో మరోసారి భూప్రకంపనలు
అమెరికాలో మరోసారి భూకంపం సంభవించింది. న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లో శుక్రవారం మరోసారి భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రెండో సారి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.0గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. న్యూజెర్సీలోని గ్లాడ్‌స్టోన్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం 9.7 కిలోమీటర్ల లోతులో ఉద్భవించిందని తెలిపింది. ఇక భూప్రకంపనలకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ ప్రకంపనలకు పలు నివాసాలు కుదుపులకు గురయ్యాయి.
నేడు కాంగ్రెస్ జనజాతర.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..!
తుక్కుగూడలో ఇవాళ కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభలో పాల్గొనే ప్రజలకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. చాలా చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రాచకొండ సీపీ తరుణ్ జోషి వాహనదారులకు పలు సూచనలు చేశారు. వాహనదారులు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిబంధనలు పాటించాలన్నారు. ఖమ్మం, నల్గొండ నుంచి విజయవాడ హైవే మీదుగా వచ్చే వాహనదారులు లేదా పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్ లేదా సర్వీస్ రోడ్డు నుంచి బెంగళూరు టోల్‌కు వెళ్లే వాహనదారులు రావిర్యాల టోల్ వద్ద ఎడమవైపు తిరిగి ఫ్యాబ్‌సిటీ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్‌కు చేరుకోవాలి.
తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు.. హైదరాబాద్‌కు సూచన లేదా..!
మండుతున్న ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ చిలిపిగా పలకరించింది. తెలంగాణలో నేటి నుంచి అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని చెప్పారు. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. వివిధ జిల్లాల్లో మూడు రోజులుగా వర్షాలు కురిసినా.. హైదరాబాద్ లో మాత్రం వర్షాలు కురిసే అవకాశం లేదని స్పష్టం చేశారు. దీంతో హైదరాబాద్ లో మాత్రం వాతావరణంలో మార్పులు ఉండవని తెలుస్తోంది. ఎప్పటిలాగానే ఎండలు మాత్రం కొనసాగుతాయి. ఇక 7, 8 తేదీల్లో తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.
ఈ రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు.. వాతావరణశాఖ అలర్ట్
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. శని, ఆదివారాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది. ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, విదర్భ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, తెలంగాణల్లో శనివారం, ఆదివారం వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తూర్పు మరియు ద్వీపకల్ప భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల్లో వేడిగాలులు వీస్తాయని వాతావరణ కార్యాలయం హెచ్చరించింది.
నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ రైతు దీక్షలు..
నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్‌ఎస్ రైతుదీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల నుండి బీఆర్‌ఎస్ రైతుదీక్షను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, పార్టీ శ్రేణులు పాల్గొని కష్టాల్లో ఉన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రైతు భద్రత పేరుతో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4 నెలలు కావస్తున్నా హామీలను అమలు చేయకుండా రైతులను అవమానిస్తున్నదని, రైతుబంధు విడుదలలో జాప్యం, కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని తెలిపారు.