సీఎం జగన్‌పై దాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరం
ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు విజయవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విజయవాడ నగరంలో ‘మేమంతా సిద్ధం’ రోడ్‌షో నిర్వహిస్తుండగా శనివారం రాత్రి సింగ్‌నగర్ డాబా కొట్ల రోడ్డులో రాయి తగిలి సీఎం నుదుటిపై గాయమైన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన ప్రాంతంలో అనుమానితుల కదలికలపై స్థానికుల నుంచి స్టేట్ మెంట్లు రికార్డ్ చేసిన పోలీసులు.. గత వారం రోజులుగా పదే పదే స్థానికంగా తిరిగిన వారి వివరాలు సేకరిస్తున్నారు. ఘటన జరిగిన స్థలంలో ఉన్న సెల్ టవర్స్ నుంచి దాడి తర్వాత ఎక్కువ సార్లు మాట్లాడిన ఫోన్ కాల్స్ పై టెక్నికల్ టీమ్ ఫోకస్ చేసింది. వివేకానంద స్కూల్ ప్రాంగణం నుంచే దాడి జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. రౌడీ షీటర్లతో పాటు, గంజాయి, చెడు వ్యసనాలు తిరిగి ఆవారా బ్యాచ్ లను పోలీసు బృందాలు విచారిస్తున్నాయి. 24 సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలించి అనుమానితులను గుర్తించే పనిలో ఉంది క్లూస్ టీమ్. బస్సు కి 20 నుంచి 30. అడుగుల దూరం నుంచే దాడి జరిగినట్టు గుర్తించిన పోలీసులు.. ఈ తరహా దాడులకు పాల్పడే పాత నేరస్తులను విచారిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం పశ్చిమ డీసీపీ హరికృష్ణ నేతృత్వంలో 20 మందితో కూడిన ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ఇందులో ఆరు బృందాలు పనిచేస్తున్నాయి. లా అండ్ ఆర్డర్, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సభ్యులుగా ఉన్న ఈ బృందాలు ఆధారాల కోసం అన్వేషణ ప్రారంభించాయి.
కేవలం రూ.500 పెట్టుబడి కోటి రూపాయలు మీ సొంతం..
ప్రభుత్వ భీమా ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ తమ కస్టమర్ల కోసం ఎన్నో రకాల కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. ఇందులో మీరు డిపాజిట్ చేసిన డబ్బు నుండి మంచి రాబడిని పొందుతారు.. ఆ పాలసీనే ఎల్‌ఐసీ కరోడ్‌పతి లైఫ్.. ఈ పాలసీలో మీరు డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మీకు చివరికి కోటి రూపాయలు పొందవచ్చు ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పాలసీలో డిపాజిట్ చేయాల్సిన మొత్తం మీరు నెలకు సుమారు 15 వేల రూపాయలు అంటే రోజుకు 500 రూపాయలు డిపాజిట్ చేయాలి. నెలకు రూ.15,000 డిపాజిట్ చేస్తూ 16 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాలి.. అంటే మీరు రూ.30 లక్షలను మొత్తంగా పెట్టుబడి పెట్టి ఒక కోటి రూపాయలను పొందవచ్చు..
నేటితో ముగిసిన కవిత సీబీఐ కస్టడీ.. నేడు ప్రత్యేక కోర్టు ముందుకు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూడు రోజుల కస్టడీ నేటితో ముగిసింది. సీబీఐ అధికారులు ఆమెను ఇవాళ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. ఉదయం 10 గంటలకు జడ్జి కావేరీ బవేజా ఎదుట కవితను ప్రవేశపెడతారు. 3 రోజుల కస్టడీలో కవిత వెల్లడించిన పలు విషయాలను సీబీఐ కోర్టుకు చెప్పే అవకాశం ఉంది. కవిత విచారణకు సహకరించడం లేదని సీబీఐ భావిస్తే.. మరో 3-5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని కోరే అవకాశం ఉంది. గతంలో ఈడీ కూడా కవితను రెండుసార్లు కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఇప్పుడు మళ్లీ సీబీఐ కస్టడీ తీసుకుంటుందా? లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. సీబీఐ కస్టడీకి కోర్టు అంగీకరిస్తే మళ్లీ కవితను సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించే అవకాశం ఉంది.
‘ఎక్స్‌ట్రా పెగ్’ తీసుకోండి.. మహిళా మంత్రికి బీజేపీ నేత సూచన.. కాంగ్రెస్ ఫైర్
కాంగ్రెస్ నాయకురాలు, రాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ రాత్రి బాగా నిద్రపోవడానికి ‘ఒక పెగ్’ తీసుకోవాలని కర్ణాటక బీజేపీ నేత సంజయ్ పాటిల్ సూచించి వివాదం రేకెత్తించారు. హెబ్బాల్కర్‌ను హేళన చేస్తూ, బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంజయ్ పాటిల్ మాట్లాడుతూ.. కర్ణాటకలో బీజేపీ పెరుగుదల హెబ్బాల్కర్‌ను చాలా ఆందోళనకు గురిచేస్తుందని, రాత్రి బాగా నిద్రపోవడానికి నిద్ర మాత్ర లేదా అదనపు పెగ్ తీసుకోవాలని సూచించారు.
‘ఎక్స్‌ట్రా పెగ్’ తీసుకోండి.. మహిళా మంత్రికి బీజేపీ నేత సూచన.. కాంగ్రెస్ ఫైర్
కాంగ్రెస్ నాయకురాలు, రాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ రాత్రి బాగా నిద్రపోవడానికి ‘ఒక పెగ్’ తీసుకోవాలని కర్ణాటక బీజేపీ నేత సంజయ్ పాటిల్ సూచించి వివాదం రేకెత్తించారు. హెబ్బాల్కర్‌ను హేళన చేస్తూ, బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంజయ్ పాటిల్ మాట్లాడుతూ.. కర్ణాటకలో బీజేపీ పెరుగుదల హెబ్బాల్కర్‌ను చాలా ఆందోళనకు గురిచేస్తుందని, రాత్రి బాగా నిద్రపోవడానికి నిద్ర మాత్ర లేదా అదనపు పెగ్ తీసుకోవాలని సూచించారు.
నేడు ఐదు రాష్ట్రాలకు బంద్ కు పిలుపు నిచ్చిన మావోయిస్టులు..
మావోయిస్టు సెంట్రల్ రీజినల్ బ్యూరో అధికార ప్రతినిధి కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది 50 మంది మావోయిస్టులు మృతి చెందారని.. ఈ ఆమరణ దీక్షకు నిరసనగా నేడు (15న) తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర.. ఐదు రాష్ట్రాలకు బంద్‌కు పిలుపునిచ్చినట్లు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు. గత 15 రోజుల్లో 22 మంది మావోయిస్టులను పోలీసులు హతమార్చారని ఆరోపించారు. ఈ నెల 6 వ తేదీన తెలంగాణ ఛత్తీస్ ఘడ్ బార్డర్ లో ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టు మృతి చెందిన ఘటనను తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యాకాండలు నరహంతక దాడిగా అభివర్ణించారు జగన్. ఈ ముగ్గురు హత్యలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమని ఆరోపించిన మావోయిస్టులు, ములుగు జిల్లా వెంకటాపురం మండలం పిట్టపాడ వద్ద గ్రేహౌండ్స్ పోలీసులు ఏకపక్ష కాల్పులు జరిపారని ఆరోపణలు ఈ ఘటనను వ్యతిరేకించండని పిలుపునిచ్చారు.
హమాస్ కాల్పుల విరమణ ప్రతిపాదన..!
ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్ దాడి తర్వాత ఇజ్రాయెల్-హమాస్ వివాదంలో కొత్త మలుపు తిరిగింది. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్ తిరస్కరించింది. అదే సమయంలో, హమాస్ కొత్త కాల్పుల విరమణ ప్రతిపాదనను సమర్పించింది. ఇందులో ఇజ్రాయెల్ బందీల విడుదలకు షరతులు విధించారు. హమాస్ కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం మధ్యవర్తులకు ఒక ఒప్పందాన్ని అందించింది. అక్టోబర్ 7 నుండి బందీలుగా ఉన్న 129 మందిలో ఎవరినైనా స్వీకరించడానికి ముందు ఇజ్రాయెల్ ఆరు వారాల కాల్పుల విరమణను పాటించాలని డిమాండ్ చేసింది.
హీబ్రూ దినపత్రిక హారెట్జ్ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈ సమాచారాన్ని ఇచ్చింది. యూఎస్ మధ్యవర్తిత్వ ఒప్పందాన్ని తిరస్కరించిన తరువాత ఉగ్రవాద బృందం ప్రతిపాదన శనివారం అర్థరాత్రి సమర్పించబడింది. నివేదిక ప్రకారం, ప్రతిపాదనలో హమాస్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF)పై షరతు విధించింది. ఈ షరతు ఏంటంటే..గాజాలో అన్ని పోరాటాలను ఆపివేసి, ఆరు వారాల పాటు పట్టణ ప్రాంతాల నుండి వైదొలిగి, స్థానభ్రంశం చెందిన పాలస్తీనియన్లను ఉత్తరం వైపుకు తిరిగి రావడానికి అనుమతించింది.
నేడు సీఎం జగన్ బస్సుయాత్ర యధాతథం
విజయవాడలో ఎన్నికల ప్రచారంలో రాళ్ల దాడి జరగడంతో ఒకరోజు విశ్రాంతి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి ‘మేమంత సిద్ధం’ యాత్రను పునఃప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. “సీఎం జగన్‌కు వైద్యులు ఈరోజు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు, అయితే ఆయన బస్సు యాత్రను కొనసాగించడానికి రేపటి నుండి తిరిగి అదే వేగంతో తిరిగి ప్రారంభిస్తారు. ప్రజలు ఆయన తిరిగి రావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, వారి తిరుగులేని మద్దతును తెలియజేయడానికి మరియు అటువంటి దారుణమైన దాడిని ఖండించడానికి సిద్ధంగా ఉన్నారు, ”అని అధికార పార్టీ నాయకుడు అన్నారు.
శనివారం అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో రాయి తగలడంతో జగన్ మోహన్ రెడ్డి ఎడమ కనుబొమ్మపై గాయమైంది. ‘మేమంత సిద్ధం యాత్ర’లో భాగంగా ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రచార బస్సులో నిలబడి ప్రజలకు అభివాదం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. జగన్ మోహన్ రెడ్డి పక్కనే నిల్చున్న విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎడమ కంటికి కూడా గాయమైంది. పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రేపు సంగారెడ్డిలో కేసీఆర్ భారీ బహిరంగ సభ..
సంగారెడ్డి జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి నేరుగా సుల్తాన్‌పూర్‌లోని బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. ప్రజలనుద్దేశించి ప్రసంగించి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరనున్నారు. దీంతో సుల్తాన్‌పూర్ బహిరంగ సభను లక్ష మందితో నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ ఏర్పాట్లు చేస్తున్నది. మెదక్ పార్లమెంట్ పరిధిలోని సంగారెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరుకానున్నారు. యువత, రైతులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేలా బీఆర్‌ఎస్ ఏర్పాట్లు చేపడుతుంది.
కోట హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది విద్యార్థులకు గాయాలు
రాజస్థాన్‌లోని కోటాలో బాలుర హాస్టల్ భవనం ఆదర్శ్ రెసిడెన్సీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది విద్యార్థులు గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయని పోలీసులు తెలిపారు. లక్ష్మణ్ విహార్‌లోని ఆదర్శ్ రెసిడెన్సీ హాస్టల్‌లో జరిగిన సంఘటనను గమనించిన కోట జిల్లా యంత్రాంగం.. భద్రతా చర్యలను పాటించకపోవడం, అగ్నిమాపక ఎన్‌ఓసి (నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్) లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించింది. అగ్నిప్రమాదానికి సంబంధించిన హాస్టల్‌కు సీలు వేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించిందని కోట మున్సిపల్ కార్పొరేషన్ అధికారి రాకేష్ వ్యాస్ తెలిపారు. కోట-సౌత్, కోటా-నార్త్‌లోని దాదాపు 2,200 హాస్టళ్లకు ఇప్పటికే ఫైర్ సేఫ్టీ మార్గదర్శకాలను పాటించనందుకు నోటీసులు అందాయని, ఈ హాస్టళ్లపై త్వరలో చర్యలు తీసుకుంటామని రాకేష్ వ్యాస్ తెలిపారు.