నేటి నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం: నేటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవం ఆరంభం కాబోతోంది. విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం (వీబీఎఫ్‌ఎస్) ఆధ్వర్యంలో జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు 11 రోజుల పాటు పుస్తక ప్రదర్శన కొనసాగనుంది. విజయవాడ బుక్ ఎక్జిబిషన్‌కు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సర్వం సిద్ధమైంది. 35వ పుస్తక మహోత్సవాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు పుస్తక మహోత్సవాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభిస్తారు.…
సరికొత్త ఆలోచనలతో బెజవాడ పోలీసులు: కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో విజయవాడ పోలీసులు ముందుకొచ్చారు. హెల్మెట్, సీటు బెల్ట్ వాడకంపై ప్రయాణికులకు చైతన్యం కల్పిస్తూ వినూత్న కార్యక్రమం చేపట్టారు. విజయవాడ పోలీసు కమీషనర్ రాజశేఖర్ బాబు అర్ధరాత్రి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూనే.. ప్రజలకు స్వయంగా అవగాహన కల్పించారు. వాహనదారులకు పోలీసు శాఖ తరఫున సీపీ హెల్మెట్‌లు పంపిణీ చేశారు. కొత్త ఏడాదిలో కొంగొత్త ఆలోచనలతో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సీపీ సూచించారు. నూతన సంవత్సర వేడుకల్లో…
ఏపీలో గానీ, నవ్యాంధ్రలో గానీ ఇదే మొదటిసారి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ నియమితులయ్యారు. 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన విజయానంద్‌ను సీఎస్‌గా నియమిస్తూ ఆదివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ డిసెంబర్ 31తో పదవీవిరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త సీఎస్‌గా విజయానంద్ బాధ్యతలు చేపడతారు. బీసీ అధికారి విజయానంద్‌కు సీఎస్‌గా…
నేడు తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవు భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈ రోజు (డిసెంబర్ 27) సెలవు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై తెలంగాణ…
సామాన్యులకు అధిక ప్రాధాన్యం: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు, తిరుమలలో ఒక కేంద్రంలో నాలుగు కౌంటర్లు ఉన్నాయని.. మొత్తంగా 91 కౌంటర్లు ఏర్పాటు చేసి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తామని బుధవారం ఓ ప్రకనలో చెప్పారు. జనవరి 10, 11, 12వ తేదీలకు గాను…
నేడు కడపకు వైఎస్ జగన్: నేడు కడప జిల్లాకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. సొంత నియోజవర్గంలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి కడపకు జగన్ చేరుకోనున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం జగన్ టూర్ మొదలవుతుంది. ఈ నెల 27న సాయంత్రం తిరిగి బెంగళూరుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్లిపోతారు. విద్యార్థులకు గుడ్…
నేడు రోజ్‌గార్ మేళా.. 71 వేల మందికి నియామక పత్రాలను అందించనున్న ప్రధాని మోడీ నేడు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కొలువల జాతర జరగబోతుంది. ఉదయం 10:30 గంటలకు ‘రోజ్‌గార్ మేళా’లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 71 వేల మంది యువకులకు నియామక పత్రాలను అందించనున్నారు. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో జరిగే రోజ్‌గార్ మేళా ప్రోగ్రాంలో ప్రధాని వర్చువల్‌గా పాల్గొని మాట్లాడనున్నారు. ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లో కేంద్ర మంత్రుల ద్వారా నియామక పత్రాలను…
న భూతో న భవిష్యత్ అనేలా అమెరికాలో గేమ్ ఛేంజర్ ఈవెంట్ రామ్ చరణ్ హీరోగా తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గేమ్ ఛేంజర్. నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిన తర్వాత నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్‌లో ఉన్నాయి. రామ్ చరణ్ సోలోగా నటించి…
పెనమలూరులో సీఎం పర్యటన: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు రాష్ట్రంలో పర్యటించనున్నారు. విజయవాడలోని పెనమలూరులో సీఎం చంద్రబాబు పర్యటించనుండగా.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటించనున్నారు. సీఎం పెనమలూరులో ధాన్యం కొనుగోలు సెంటర్ పరిశీలించి.. రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. అనంతరం రెవెన్యూ సదస్సులో పాల్గొని అధికారులకు దిశా నిర్ధేశం చేయనున్నారు. మళ్లీ అజ్ఞాతంలోకి మంచు మోహన్ బాబు: ‘కలెక్షన్ కింగ్’ మోహన్ బాబు మళ్లీ అజ్ఞాతంలోకి…
ఏపీలో ‘డైకిన్’ పెట్టుబడులు: జపాన్‌కు చెందిన ఎయిర్ కండిషనింగ్, రిఫ్రిజిరేషన్ సిస్టమ్స్ తయారీ దిగ్గజం ‘డైకిన్’ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో కంప్రెసర్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. తైవాన్‌కు చెందిన రెచి ప్రెసిషన్ భాగస్వామ్యంతో రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. డైకిన్ ఇండియా, రెచి ప్రెసిషన్ కలిసి ఇన్వర్టర్, నాన్ ఇన్వర్టర్ ఏసీలలో వినియోగించే రోటరీ కంప్రెసర్లను తయారుచేసి.. విదేశాలకు ఎగుమతి చేయనుంది. నేడు కర్నూలుకు మాజీ సీఎం వైఎస్ జగన్: మాజీ సీఎం వైఎస్…