Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Headlines Top Headlines 9 Pm On February 23rd 2023

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Published Date :February 23, 2023 , 9:35 pm
By Sudhakar Ravula
Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

అప్పటి వరకు బండి సంజయే అధ్యక్షుడు.. స్పష్టం చేసిన తరుణ్‌ చుగ్
భారతీయ జనతా పార్టీ (బీజేపీ), తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై పార్టీ అధిష్టానం గట్టి నమ్మకాన్ని పెట్టుకున్నట్టుందే.. సంజయ్‌ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. దానికి కారణం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ తరుణ్‌ చుగ్‌ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.. ఎందుకంటే.. 2024 వరకు బండి సంజయ్‌నే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉంటారని స్పష్టం చేశారు తరుణ్‌ చుగ్.. పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగేవరకు అధ్యక్షుడిగా సంజయ్‌ కొనసాగుతారని క్లారిటీ ఇచ్చారు.. ఇక, కార్నర్‌ మీటింగ్‌లతో కేసీఆర్‌ సర్కార్‌కు చివరి మేకు దించుతున్నాం అన్నారు.. బీజేపీ జిల్లా అధ్యక్షుల సంస్థాగత స్ట్రక్చర్ లో మార్పు చేయాలని నిర్ణయం తీసుకున్నాం.. తెలంగాణలో ఉన్న రెవెన్యూ జిల్లాల ఆధారంగా పార్టీ అధ్యక్షులను నియమించడం కాకుండా నియోజకవర్గాలను బేస్‌గా చేసుకుని అధ్యక్షులను పెట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

డాక్టర్ ప్రీతి పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల..
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఆత్మహత్యాయత్నం చేసిన మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితి బులెటిన్‌ విడుదల చేశారు హైదరాబాద్‌లోని నిమ్స్‌ వైద్యులు.. సీనియర్ విద్యార్థి వేధింపులలు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ మెడికో పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.. ప్రీతికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు నిమ్స్ వైద్యులు బులెటిన్‌లో పేర్కొన్నారు.. ప్రీతికి మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ జరిగిందని, చికిత్సకు ఆమె శరీరం ఏమాత్రం సహకరించడం లేదని వైద్యులు చెబుతున్నారు.. బీపీ, పల్స్ రేటు నమోదు కాని పరిస్థితి ఏర్పడింది.. ప్రీతికి ఐదుగురు వైద్యుల బృందం చికిత్స అందిస్తోందని వెల్లడించారు.. ప్రీతి నిమ్స్ లో జాయిన్ అయ్యేటప్పటికి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఉందంటున్నారు వైద్యులు.. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. ఎక్మో సపోర్ట్‌తో ట్రీట్మెంట్ చేస్తున్నామని.. కార్డియాక్, శ్వాస కోశ సమస్యలు ఉన్నాయని.. అన్ని డిపార్ట్మెంట్‌లు.. క్లోస్ మానటరింగ్ చేస్తున్నాయని బులెటిన్‌లో పేర్కొన్నారు నిమ్స్‌ వైద్యులు.

Also Read

  • Achari Lauki Salad Recipe: వేసవిలో చల్లని సొరకాయ ఊరగాయ సలాడ్.. సులభమైన టేస్టీ రెసిపీ..
  • Gold and Silver Prices: మళ్లీ తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..
  • Post Office New Rules 2026: మారిన పోస్టాఫీసు రూల్స్‌.. పాన్‌ తప్పనిసరి.. లేకపోతే ఒక్కటే మార్గం..!
  • Hantavirus Alert: భయపెడుతున్న హంటావైరస్.. లక్షణాలు, వ్యాప్తి, ప్రమాదాలపై వైద్యుల హెచ్చరికలు..

ఐసీయూలో వధువు..! తాళికట్టిన వరుడు..
అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన వధువును ఆస్పత్రి బెడ్‌పైనే పెళ్లి చేసుకున్నాడు యువకుడు.. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆస్పత్రి బెడ్‌పై ఉన్న వధువుకు తాళి కట్టాడు వరుడు. ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగి చికిత్స పొందుతున్న వధువుకు వరుడు ఆసుపత్రిలోనే.. అది కూడా ఐసీయూలోని బెడ్‌పైనే తాళి కట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే.. చెన్నూరు మండలం లంబాడిపల్లికి చెందిన శైలజ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన తిరుపతికి వివాహాన్ని నిశ్చయించారు… ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం.. ఇవాళ వివాహం జరగాల్సి ఉంది.. కానీ, ఒక రోజు ముందు.. అంటే బుధవారం రోజు అస్వస్థత గురైంది వధువు.. వెంటనే ఆ వధువును మంచిర్యాలకు తీసుకెళ్లారు.. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.. అక్కడే ఆమెకు ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం.. ఐసీయూలో ఉంది వధువు.. అయితే, పెళ్లి వాయిదా వేయడం ఎందుకు? అని.. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారు.. ఆస్పత్రిలోనే.. బెడ్‌పైనే పెళ్లి నిర్వహించడానికి పూనుకున్నారు.. ఇంకేముందు.. వరుడుని తీసుకొని ఆస్పత్రికి వెళ్లారు.. ఆసుపత్రిలోనే బెడ్ పై ఉన్న శైలజకు తాళికట్టి భార్యగా చేసుకున్నాడు. సంప్రదాయం ప్రకారం.. బెడ్‌పైనే ఉన్న వధువుకు మెట్టలు పెట్టించారు.. అన్ని కార్యక్రమాలు నిర్వహించారు.. ఇద్దరి తరపు బంధువులు వచ్చి.. కొత్త జంటను ఆశీర్వదించారు.. అందరి ముందు దండలు మార్చుకుని ఈ జంట ఒక్కటైంది. అయితే, గతంలోనూ ఆస్పత్రిలో పెళ్లిలు జరిగిన ఘటనలు లేకపోలేదు..

ఎఫైర్‌ను బయటపెడుతారన్న భయంతో ఉరేసుకున్న యువకుడు
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వివాహేతర సంబంధాన్ని బయటపెడతారన్న భయంతో మాదు మనోహర్‌ అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సెల్ఫీ వీడియోతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో ఓ వివాహిత మహిళతో మనోహర్‌ వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. ఆ మహిళ తన భర్తని వదిలేసి వస్తానంటే మనోహర్‌ వద్దన్నాడు. అతను వద్దనడంతో మనస్తాపానికి గురైన ఆ మహిళ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. మహిళ మరణానంతరం విషయం బయటకు రావడంతో ఆ కేసులో మూడు నెలలు జైలు శిక్షను మనోహర్ అనుభవించాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత పొలం పనులకు వెళుతుంటే చనిపోయిన మహిళతో తాను సన్నిహితంగా ఉన్న వీడియో బయట పెడతామంటూ ముగ్గురు వ్యక్తులు బెదిరిస్తున్నారని మనోహర్ తాను రికార్డు చేసిన సెల్ఫీ వీడియోలో తెలిపాడు. బుధవారం సాయంత్రం మైలవరంలోని తన ఇంట్లో ఎవరూ లేనప్పుడు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి మనోహర్‌ ఉరేసుకున్నాడు. ఇంతలోనే బావి వద్ద నుంచి వచ్చిన కుటుంబసభ్యులు గమనించి అతడిని కాపాడారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు.

మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం.. నిందితుడిపై అట్రాసిటీ కేసు
కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు ర్యాగింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్‌పై క్రైమ్ నంబర్ 69/2023 u/s 306 r/w 108 , 354 of IPC, 4(v) of ragging act, 3(1)(r), 3 (2)(va),3 (1)(w)(ii) of sc st act నమోదు చేశామని వరంగల్‌ పోలీస్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ తెలిపారు.. బాధితురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి.. ఈ కేసు నమోదు చేశామని తదుపరి విచారణ అనంతరం శాఖ పరమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా వివరించారు.. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు శిక్షార్హులే నని దోషులు ఎప్పటికైనా తప్పించు కోలేరని స్పష్టం చేశారు.. అయితే, సంస్థాగతంగా పూర్తి స్థాయిలో విచారణ లేకుండా సామాజిక మధ్యమాల్లో వస్తున్న సమాచారం సరైనది కాదని.. అందరూ సంయవనం పాటించాలని సూచించారు అసిస్టెంట్‌ కమిషనర్‌ బోనాల కిషన్.

ఆటలో ఓడిపోయినందుకు తనను చూసి నవ్వారని.. ఏడుగురిని చంపేశాడు!
బ్రెజిల్‌లో ఘోరం జరిగింది. ఆటలో ఓటమి పాలైన తనను చూసి నవ్వారని ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఏడుగురిని చంపేశాడు. 12 ఏళ్ల బాలికతో సహా ఏడుగురు వ్యక్తులు తనను చూసి నవ్వారని వారిని కాల్చి హత్య చేశాడు. ఈ సంఘటన బ్రెజిల్‌లోని మాటో గ్రాసోలోని సినోప్ సిటీలో మంగళవారం జరిగింది. మాటో గ్రోసో రాష్ట్రంలోని సినోప్‌ నగరానికి చెందిన ఎడ్గర్‌ రికార్డో డి ఒలివిరా గత మంగళవారం స్థానిక పూల్‌ హాల్‌కు వెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తితో 4000 రియాస్‌కు పందెం కాసి పూల్‌ గేమ్‌లో ఓటమి పాలయ్యాడు. దీంతో అసహనానికి గురైన ఒలివిరా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొంతసేపటికి తన స్నేహితుడు ఎజిక్వియాస్‌ సౌజా రెబిరోతో అక్కడికి వచ్చిన ఒలివిరా.. మళ్లీ అదే వ్యక్తితో పందెం కాశారు. రెండోసారి కూడా అతడు ఓడిపోవడంతో పూల్ హాల్‌లో ఉన్న కొందరు అతడిని చూసి నవ్వారు. రెండోసారి కూడా ఓడిపోవడంతో అక్కడి వ్యక్తులు నవ్వగా.. ఇది ఒలివిరాకు కోపం తెప్పించింది. అతను పికప్ ట్రక్ నుంచి షాట్‌గన్‌ని తీసుకున్నాడు. అయితే ఎజెక్వియాస్ పిస్టల్‌ను వినియోగించి అందరినీ లైన్‌లో నిలబెట్టాడు. ఒలివిరా పూల్ యజమానితో పాటు ఇతర వ్యక్తులను కాల్చి చంపాడు. వారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఏడవ బాధితుడు మొదట్లో ప్రాణాలతో బయటపడ్డాడు కానీ ఆ తర్వాత ఆసుపత్రిలో మరణించాడు. పోలీసులు బాధితుల పేర్లను విడుదల చేశారు. లారిస్సా ఫ్రసావో డి అల్మెయిడా, ఒరిస్బెర్టో పెరీరా సౌసా, అడ్రియానో బాల్బినోట్, గెటులియో రోడ్రిగ్స్ ఫ్రసావో జూనియర్, జోస్యు రామోస్ టెనోరియో, పూల్ హాల్ యజమాని మసీల్ బ్రూనో డి ఆండ్రేడ్ కోస్టా మృతి చెందినట్లు తెలిపారు. ఏడవ బాధితుడు ఎలిజ్యూ శాంటోస్ డా సిల్వా ఆస్పత్రిలో చనిపోయినట్లు తెలిపారు. ఈ ఘటన అంతా పూల్ హాల్‌లోని సీసీటీవీలో రికార్డైంది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వారిద్దరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

విప్రోకి షాకిచ్చిన కోహ్లీ.. మూడు దశాబ్దాల తర్వాత రాజీనామా..
చిన్న సంస్థల నుంచి దిగ్గజాల వరకు.. వరుసగా ఐటీ సంస్థలు ఉద్యోగులను ఇంటికి పంపుతూనే ఉన్నాయి.. అయితే.. ఐటీ దిగ్గజం విప్రోకు షాక్‌ ఇచ్చారు రాజన్‌ కోహ్లీ.. విప్రో ప్రెసిడెంట్‌గా ప‌ని చేస్తున్న రాజ‌న్ కోహ్లీ రాజీనామా చేశారు. సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌లు సైతం త‌ప్పుకుంటున్న సందర్భంలో రాజ‌న్ కోహ్లీ రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది.. అయితే, దాదాపు మూడు ద‌శాబ్దాలుగా విప్రోతో కోహ్లీకి అనుబంధం ఉండగా.. ఆ బంధానికి బైబై చెప్పేశారు.. విప్రో ఇంటిగ్రేటెడ్ డిజిట‌ల్, ఇంజినీరింగ్ అండ్ అప్లికేష‌న్ స‌ర్వీసెస్ బిజినెస్ లైన్ (ఐడీయాస్‌)కు అధ్యక్షుడిగా కొనసాగిన రాజన్‌ కోహ్లీ.. ల‌క్ష మందికిపైగా ఉద్యోగులు గ‌ల టీమ్‌కు సారథ్యం వహిస్తున్నారు.. ఆయన ఇప్పుడు ఆ సంస్థకు గుడ్‌బై చెప్పడంతో.. బిగ్‌ షాక్‌ తగిలినట్టు అయ్యింది..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cricket
  • telangana
  • Top Headlines @ 9 PM on February 23rd 2023
  • Top Headlines @9 PM

తాజావార్తలు

  • Achari Lauki Salad Recipe: వేసవిలో చల్లని సొరకాయ ఊరగాయ సలాడ్.. సులభమైన టేస్టీ రెసిపీ..

  • Gold and Silver Prices: మళ్లీ తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..

  • Post Office New Rules 2026: మారిన పోస్టాఫీసు రూల్స్‌.. పాన్‌ తప్పనిసరి.. లేకపోతే ఒక్కటే మార్గం..!

  • UAE Drone Attack: యూఏఈలో భారతీయులపై దాడి.. తమ పౌరుల రక్తం చిందితే ఊరుకోం.. భారత విదేశాంగ శాఖ హెచ్చరిక!

  • Vishwambhara : విశ్వంభ‌ర నుండి కీరవాణి ఔట్.. గౌరహరి ఇన్

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions