హోమ్ గార్డుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ: హోమ్ గార్డుల పోస్టుల భర్తీకై ఏపీ సీఐడీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ సీఐడీ విభాగంలో 28 హోమ్ గార్డుల పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన మహిళా, పురుష అభ్యర్థులు మే 1 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఇందుకు 18 నుండి 50 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 18 నుండి 50…
ఏపీలో రోడ్లు, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి: రాజధాని అమరావతి ప్రాంతంలో ఏపీ మంత్రి నారాయణ పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోడీ సభకు వచ్చే రహదారులను ఆయన పరిశీలించారు. గుంటూరు, ఏలూరు, విజయవాడ ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు సంబంధించి రహదారి మార్గాల విషయంలో అధికారులకు మంత్రి సూచనలు చేశారు. కొన్ని రోడ్లు వెంటనే వెడల్పు చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి నారాయణ అధికారులకు చెప్పారు. ప్రధాని…
ఎస్వీ గోశాల వద్ద నాటకీయ పరిణామాలు: తిరుపతి ఎస్వీ గోశాల వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, పులివర్తి నాని, కలికిరి మురళీ మోహన్, నవాజ్ బాషాలు ఫోన్ చేశారు. ఎస్వీ గోశాలను సందర్శించాలని భూమనను కూటమి శాసనసభ్యులు కోరారు. అసత్య ఆరోపణలు చేయడం కాదు.. క్షేత్రస్థాయికి రావాలన్నారు. పోలీసుల సూచనల మేరకు ఐదుగురితో గోశాలకు రావాలని సూచించారు. ఎమ్మెల్యేల పిలుపుతో గోశాలకు వస్తానని…
నెల్లూరు జిల్లాలో అమోనియా లీక్: నెల్లూరు జిల్లాలో అమోనియా లీక్ ఘటన కలకలం సృష్టించింది. టీపీ గూడూరు మండలం అనంతపురం గ్రామంలో అమోనియా లీకైంది. వాటర్‌బేస్ కంపెనీలో అమోనియా గ్యాస్ లీక్ కావడంతో.. ఊపిరాడక కార్మికులు హుటాహుటిన పరుగులు తీశారు. ఈ ఘటనలో 10 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. అనంతపురం చుట్టుపక్కల గ్రామాలకు సైతం అమోనియా గ్యాస్ భారీగా వ్యాపించింది. అమోనియా గ్యాస్ లీక్‌తో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.…