PM Modi: శనివారం 3 వందేభారత్ రైళ్లు ప్రారంభించనున్న మోడీ
- శనివారం 3 వందేభారత్ రైళ్లు ప్రారంభించనున్న మోడీ
- దక్షిణ భారత్‌లో రెండు రైళ్లు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ శనివారం మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. మూడు రైళ్లలో రెండు సర్వీసులు దక్షిణ రైల్వే జోన్‌కు సంబంధించినవి కావడం విశేషం. కొత్త రైళ్లు తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్-నాగర్‌కోయిల్, మదురై-బెంగళూరు కంటోన్మెంట్ మధ్య నడవనున్నాయి. చెన్నై సెంట్రల్, మదురై జంక్షన్ స్టేషన్లలో వేడుక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మూడో రైలు.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్- లక్నో మధ్య నడవనుంది.
ఇది కూడా చదవండి: Nandamuri Balakrishnal: నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు అందరికీ ఆహ్వానం
Also Read
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
చెన్నై-నాగర్‌కోయిల్ వందే భారత్ బుధవారం మినహా ఆరు రోజులు నడుస్తుంది. మదురై-బెంగళూరు కంటోన్మెంట్ వందే భారత్ ఆరు రోజుల పాటు నడుస్తుంది. దక్షిణ రైల్వే జోన్‌లో నడవనున్న మూడు కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం జెండా ఊపి ప్రారంభించనున్నారు.
చెన్నై ఎగ్మోర్-నాగర్‌కోయిల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20627/20628) రైలు బుధవారాలు మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. చెన్నై ఎగ్మోర్, తాంబరం, విల్లుపురం, తిరుచ్చిరాపల్లి, దిండిగల్, మదురై, కోవిల్‌పట్టి, తిరునెల్వేలి మరియు నాగర్‌కోయిల్ జంక్షన్‌లలో రైలు ఆగుతుంది. రైలు చెన్నై ఎగ్మోర్ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకు నాగర్‌కోయిల్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో నాగర్‌కోయిల్‌లో మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు చెన్నై ఎగ్మోర్ చేరుకుంటుంది. చైర్ కార్ ధర రూ. 1,760 కాగా… ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ. 3,240. క్యాటరింగ్ ఛార్జీలతో కలిపి ఈ ధర ఉందనుంది.
ఇది కూడా చదవండి: Chirag Paswan: ప్రధాని మోడీ నుంచి నన్ను విడదీయలేరు..
ఇదిలా ఉండగా మదురై-బెంగళూరు కంటోన్మెంట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20671/20672) రైలు సర్వీస్ మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు కూడా నడుస్తుంది. ఇది దిండిగల్, తిరుచ్చిరాపల్లి, కరూర్, నమక్కల్, సేలం మరియు కృష్ణరాజపురంలలో ఆగుతుంది. దక్షిణ రైల్వే షెడ్యూల్ ప్రకారం.. రైలు మదురై జంక్షన్ నుంచి ఉదయం 5.15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ చేరుకుంటుంది. తిరిగి ప్రయాణంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు కంటోన్మెంట్ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి రాత్రి 9.45 గంటలకు మధురై చేరుకుంటుంది. ఒక చైర్ కార్ ధర రూ. 1,575, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఛార్జీ రూ. 2,865. క్యాటరింగ్ ఛార్జీలతో కలిపి ఉండనుంది.
ఇది కూడా చదవండి: Shera: 1.4 కోట్లతో రేంజ్ రోవర్ కారు కొన్న సల్మాన్ ఖాన్ బాడీగార్డ్… జీతం ఎంతో తెలుసా?
తాజావార్తలు
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
-
AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!