Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సినిమా థియేటర్లలో కనీస వసతులు, వాటర్ బాటిళ్లు, ఆహార పదార్థాల ధరలపై విచారణ జరపాలని ఆదేశించడంతో అధికార యంత్రాంగం కదిలింది. ఏపీలోని సినిమా థియేటర్లలో ఆర్డీవో, ఎమ్మార్వో, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తనిఖీలు చేపడుతున్నారు. కాకినాడలోని చాణక్య చంద్రగుప్త థియేటర్లలో తనిఖీలు చేశారు. అలాగే పెద్దపూడి, కాజులూరు, తాళ్లరేవు, కరప, కాకినాడ రూరల్ థియేటర్లలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.…
సగటు సినిమా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం అనే అంశం పై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానని దిల్ రాజు అన్నారు. ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఆయన సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న పవన్ అభిప్రాయం అభినందనీయం. దీనిని మనమందరం స్వాగతించి, కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని అన్నారు. Also Read: Manchu Brothers: కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్సింగ్…
టాలీవుడ్లో భారీ అంచనాలతో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం ‘కన్నప్ప’ తాజాగా ఒక అనూహ్య సంఘటనతో వార్తల్లో నిలిచింది. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలోని కీలక వీఎఫ్ఎక్స్ డేటా మరియు ఒక ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ ఉన్న హార్డ్ డిస్క్ చోరీ అయినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మంచు విష్ణు నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ ఘటనకు కారణమైన చరిత అనే మహిళపై…
టాలీవుడ్లో భారీ అంచనాలతో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం ‘కన్నప్ప’ మరోసారి వార్తల్లో నిలిచింది. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలోని కీలక దృశ్యాలు ఉన్న హార్డ్ డిస్క్ చోరీ అయినట్లు తాజాగా సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మంచు విష్ణు నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సంఘటన సినీ వర్గాల్లో సంచలనంగా మారడంతో పాటు, చిత్ర బృందానికి ఊహించని ఎదురుదెబ్బగా నిలిచింది. Also Read:Unni Mukundan…
Pawan Kalyan : టాలీవుడ్ లో థియేటర్ల బంద్ అంశం రోజురోజుకూ రచ్చ లేపుతోంది. ఇప్పటికే పవన్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడంతో.. అల్లు అరవింద్, దిల్ రాజు బయటకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వివరణ ఇచ్చుకున్నారు. త్వరలోనే మరింత మంది బయటకు వచ్చి మాట్లాడుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో తాజాగా పవన్ కల్యాణ్ నుంచి మరో సంచలన ప్రకటన వచ్చింది. తాజాగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ తో పవన్ కల్యాణ్ భేటీ…
తెలుగు చిత్ర రంగంలో సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు వెలువడటానికి గల నేపథ్యం, ఆ నలుగురు ప్రమేయం, తమకు సంబంధం లేదని ఇద్దరు నిర్మాతలు ప్రకటించడం, తూర్పు గోదావరి జిల్లాలో తొలుత బంద్ ప్రకటన వెలువడిన క్రమం తదితర అంశాల మీద ఏపీ డిప్యూటీ సీఎం అధికారులతో చర్చించారు. బంద్ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వివరించారు. బంద్ ప్రకటన వెనక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన…
నారా రోహిత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామమూర్తి నాయుడు కుమారుడైన రోహిత్ సినిమాల మీద ఆసక్తితో ఎప్పుడో బాణం అనే సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. ఆ తర్వాత చేసిన సోలో ఇలాంటి సినిమా ఆయనకు మంచి హిట్ వచ్చింది. ఆ తర్వాత చేస్తున్న సినిమాలన్నీ వైవిధ్యంగా ఉన్నా ఎందుకో హిట్స్ అందుకోలేకపోయాడు. Also Read:Kamal Hasan : త్వరలోనే పహల్గాంకు వెళ్తా..…
Chiranjeevi : చిరంజీవికి పోటీగా నవీన్ పోలిశెట్టి మారాడు. చిరుతో పోటీకి రిస్క్ చేస్తున్నాడా.. ఒకవేళ తేడా వస్తే ఎలా అనే చర్చ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీగా హైప్ పెంచేస్తున్నారు. పైగా 2026 సంక్రాంతికే తమ సినిమా ఉంటుందని ముందే ప్రకటించారు. అందరికంటే ముందే సంక్రాంతి డేట్ ను లాక్ చేసుకుంది ఈ సినిమానే. అనిల్…
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో అందరితో మంచి రిలేషన్ మెయింటేన్ చేస్తుంటాడు. చాలా మందికి తన రౌడీ బ్రాండ్ బట్టలు లేదంటే ఇతర ఖరీదైన వస్తువులను గిఫ్ట్ లుగా ఇస్తుంటాడు. తాజాగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కు కూడా మంచి గిఫ్ట్ ఇచ్చాడు. విజయ్ నటిస్తున్న తాజా మూవీ కింగ్ డమ్. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా.. అనేక కారణాలతో…
Tabu : సీనియర్ హీరోయిన్ టబు ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంది. అటు బాలీవుడ్ లో ఇటు సౌత్ లో కీలక పాత్రల్లో చేస్తోంది. అలాగే కొన్ని రొమాంటిక్ సీన్లలో చేయడానికి కూడా వెనకాడట్లేదు. ఆమె గతంలో యంగ్ హీరో ఇషాన్ ఖట్టర్ తో చేసిన సినిమాలో రొమాంటిక్ సీన్లలో నటించింది. వాస్తవానికి టబు కంటే ఇషాన్ చాలా చిన్నవాడు. సీనియర్ బ్యూటీతో అలాంటి సీన్లు చేయడంపై తాజాగా ఇషాన్ స్పందించాడు. టబు చాలా అనుభవజ్ఞురాలు అని..…