Mohanbabu : కన్నప్ప సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే మంచు విష్ణు, మోహన్ బాబు వరుస ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా మోహన్ బాబు కన్నప్ప సినిమాపై స్పెషల్ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో తన తల్లి గురించి కూడా మాట్లాడారు. ఆటవికుడైన తిన్న.. కన్నప్పగా ఎలా మారాడు అనేది ఆయన వీడియోలో వివరిస్తూ కొంత ఎమోషనల్ అయ్యారు. తన దృష్టిలో తల్లిదండ్రులే కన్నప్పలు అంటూ తెలిపారు.
Read Also : Lakshmi Narasimha : రీ రిలీజ్ లో కొత్త ట్రెండ్.. బాలయ్య సినిమాకి కొత్త సాంగ్
‘ఓ ఆటవికుడు, అమాయకుడు అయిన కన్నప్ప.. తన కళ్లనే శివుడికి ఇచ్చి చరిత్రలో గొప్పవాడిగా నిలబడ్డాడు. మనం ఏమీ అడగకపోయినా అమ్మ అన్నం పెడుతుంది. మనకు ఏదీ కావాలన్నా సరే తల్లిదండ్రులే ఇస్తారు. నా దృష్టిలో తల్లిదండ్రులే మనకు కన్నప్పలు. నా తల్లికి ఐదుగురు సంతానం. మా ఊరి నుంచి టౌన్ వరకు ఏడు కిలోమీటర్లు నడుచుకుంటూ కాలువ, సువర్ణముఖి నదిని దాటేది మా అమ్మ.
మా అమ్మ కష్టం తలుచుకుంటేనే నాకు కన్నీళ్లు వస్తున్నాయి. నా కంఠాన్ని అందరూ మెచ్చుకుంటున్నప్పుడు నా మాటలు నా తల్లికి వినిపిస్తే ఎంత బాగుంటుంది అనిపించేది. కానీ ఇప్పుడు ఆ మహాతల్లి నా దగ్గర లేదు. ఆమెకు శతకోటి వందనాలు’ అంటూ చెప్పుకొచ్చాడు మోహన్ బాబు. ఆయన చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : Nabha : ఈ సంతోషాలు ఇచ్చినందుకు రుణపడి ఉంటా!
#MyKannappaStory#kannappa #harharmahadevॐ pic.twitter.com/uFJUAE0qVg
— Mohan Babu M (@themohanbabu) June 5, 2025