Allu Arjun: ‘పుష్ప’ నుంచి బయటకు రావాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా పరిశ్రమలో ఐకాన్ స్టార్‌గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల కలెక్షన్స్‌తో సంచలన విజయం సాధించాడు. ఇప్పుడు దర్శకుడు అట్లీతో కలిసి ‘AA22xA6’ అనే భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం, అల్లు అర్జున్‌ను సరికొత్త అవతారంలో చూపించనుంది. ‘పుష్ప’ సిరీస్‌లో రఫ్ అండ్ రగ్గడ్ లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన అల్లు అర్జున్, ఈ సినిమా కోసం పూర్తిగా భిన్నమైన లుక్‌లో కనిపించనున్నాడు.
Also Read:Telusu Kada : అందరికీ తెలిసేలా చేప్పేది ఆరోజే!
Also Read
- Varanasi Update: 'వారణాసి'లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
- world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. 'భోగి' టీజర్ రిలీజ్
- Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ సహకారంతో అల్లు అర్జున్ తన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై దృష్టి సారించాడు. లాయిడ్ స్టీవెన్స్, గతంలో జూనియర్ ఎన్టీఆర్ (‘RRR’), మహేష్ బాబు, రణవీర్ సింగ్ వంటి స్టార్స్‌తో పనిచేశాడు. ‘AA22xA6’లో అల్లు అర్జున్ కేవలం ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తోనే కాకుండా, విభిన్నమైన హెయిర్ స్టైల్స్‌తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. ఇటీవల ముంబైలో జరిగిన WAVES సమ్మిట్ 2025లో అల్లు అర్జున్ కొత్త హెయిర్ స్టైల్‌తో కనిపించాడు, ఇందులో అతను తన జుట్టును షార్ట్‌గా కట్ చేసి, బీర్డ్‌ను ట్రిమ్ చేసిన స్టైలిష్ లుక్‌లో కనిపించాడు.
Also Read:Rajendra Prasad: నేను ఇలానే మాట్లాడతా.. మీ కర్మ!
అయితే, ఇది ఫైనల్ లుక్ కాదని, సినిమా కోసం మరిన్ని వైవిధ్యమైన లుక్స్‌ను పరీక్షిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్‌లో కనిపించనున్నాడని, అందులో ఒక పాత్ర నెగటివ్ షేడ్స్‌తో ఉంటుందని ఇన్‌సైడ్ వర్గాలు తెలిపాయి. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘AA22xA6’ ఒక సై-ఫై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఇందులో పారలల్ యూనివర్స్ కాన్సెప్ట్‌తో పాటు అత్యాధునిక VFX ఉంటాయని తెలుస్తోంది.త్రం రూ. 600-700 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతున్న భారీ ప్రాజెక్ట్ కావడంతో అల్లు అర్జున్ అభిమానులు ఈ కొత్త లుక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!