Kamal Haasan : కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన కామెంట్స్ తీవ్ర వివాదం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే థగ్ లైఫ్ మూవీని కన్నడలో బ్యాన్ చేశారు. క్షమాపణ చెప్పాలంటూ కన్నడ నాట నిరసనలు వినిపిస్తూనే ఉన్నాయి. థగ్ లైఫ్ ఈవెంట్ లో తమిళ్ నుంచే కన్నడ పుట్టిందంటూ కమల్ హాసన్ కామెంట్స్ చేశారు. దాంతో కన్నడ నాట వివాదం రాజుకుంది. కన్నడను తక్కువ చేసి మాట్లాడారు అంటూ కమల్ హాసన్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కన్నడ ఇండస్ట్రీ ఏకంగా హైకోర్టుకు వెళ్లింది. దీనిపై కమల్ హాసన్ క్షమాపణ చెప్పట్లేదు. అయితే తాజాగా కమల్ హాసన్ కామెంట్లపై హీరో రానా స్పందించాడు.
Read Also : 2026 Sankranti: చిరంజీవి vs రవితేజ.. 2026 సంక్రాంతికి రేసు రసవత్తరం!
ఆయన నటించని రానా నాయుడు సీజన్ 2 ప్రమోషన్లలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..’సోషల్ మీడియా అనేది ప్రతి వ్యక్తి భావాన్ని తెలిపేదిగా మారిపోయింది. ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడినా సరే వివాదాస్పదం అవుతోంది. ఒకప్పుడు ఇలాంటివి లేవు. కానీ ఇప్పుడు ఏం మాట్లాడినా రాజకీయ అంశమే అయిపోతోంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
థగ్ లైఫ్ మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. కర్ణాటకలో ఆగిపోవడంతో రూ.12.5 కోట్ల రెవెన్యూ లాస్ అయ్యారు. దీనిపై కమల్ హాసన్ సుప్రీంకోర్టుకు వెళ్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు ఆయన దానిపై స్పందించలేదు. ఇంకోవైపు కన్నడ నాట ఆగ్రహ జ్వాలలు ఆగట్లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో కమల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.