Chiranjeevi : చిరంజీవికి పోటీగా నవీన్ పోలిశెట్టి మారాడు. చిరుతో పోటీకి రిస్క్ చేస్తున్నాడా.. ఒకవేళ తేడా వస్తే ఎలా అనే చర్చ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీగా హైప్ పెంచేస్తున్నారు. పైగా 2026 సంక్రాంతికే తమ సినిమా ఉంటుందని ముందే ప్రకటించారు. అందరికంటే ముందే సంక్రాంతి డేట్ ను లాక్ చేసుకుంది ఈ సినిమానే. అనిల్…
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో అందరితో మంచి రిలేషన్ మెయింటేన్ చేస్తుంటాడు. చాలా మందికి తన రౌడీ బ్రాండ్ బట్టలు లేదంటే ఇతర ఖరీదైన వస్తువులను గిఫ్ట్ లుగా ఇస్తుంటాడు. తాజాగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కు కూడా మంచి గిఫ్ట్ ఇచ్చాడు. విజయ్ నటిస్తున్న తాజా మూవీ కింగ్ డమ్. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా.. అనేక కారణాలతో…
Tabu : సీనియర్ హీరోయిన్ టబు ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంది. అటు బాలీవుడ్ లో ఇటు సౌత్ లో కీలక పాత్రల్లో చేస్తోంది. అలాగే కొన్ని రొమాంటిక్ సీన్లలో చేయడానికి కూడా వెనకాడట్లేదు. ఆమె గతంలో యంగ్ హీరో ఇషాన్ ఖట్టర్ తో చేసిన సినిమాలో రొమాంటిక్ సీన్లలో నటించింది. వాస్తవానికి టబు కంటే ఇషాన్ చాలా చిన్నవాడు. సీనియర్ బ్యూటీతో అలాంటి సీన్లు చేయడంపై తాజాగా ఇషాన్ స్పందించాడు. టబు చాలా అనుభవజ్ఞురాలు అని..…
Allu Aravind : టాలీవుడ్ లో థియేటర్ల మూసివేతపై పెద్ద రగడ సాగుతోంది. తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటూ పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ నలుగురు నిర్మాతలు కలిసి పవన్ సినిమాను అడ్డుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. కొన్ని రోజులుగా వినిపిస్తున్న అనేక రూమర్లపై ఆయన తాజాగా స్పందించారు. ‘కొన్ని రోజులుగా ఆ నలుగురు.. ఆ నలుగురు అంటున్నారు. నేను ఆ నలుగురిలో…
Vishu – Manoj : మంచు ఫ్యామిలీ రగడ ఏ స్థాయికి చేరుకుందో మొన్నటి దాకా చూశాం. విష్ణు వర్సెస్ మనోజ్ అన్నట్టు సాగిన ఈ రచ్చ.. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే దాకా వెళ్లింది. మనోజ్ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ వివాదం కాస్తా కన్నప్ప వర్సెస్ భైరవం అనే దాకా వెళ్లింది. కన్నప్పపై మంచు మనోజ్ ట్రోలింగ్ చేస్తూ కామెంట్లు కూడా చేశాడు. కానీ ఏమైందో తెలియదు..…
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి వచ్చిన ప్రెస్ నోట్ ఇటు టాలీవుడ్ అటు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. తెలుగు పరిశ్రమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలు అంటూ పవన్ నుంచి వచ్చిన వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ పట్ల ప్రభుత్వం అనుసరించబోయే ధోరణి గురించి సవివరంగా చెప్పడం నిర్మాతల్లో తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. కూటమి ఏర్పడి ఏడాది అవుతున్నా.. ఇప్పటిదాకా టాలీవుడ్ సంఘాలు, ప్రతినిధులు ఎవరూ…
Naga Vamsi : టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ ప్రకటనతో రచ్చ మొదలైంది. ఈ క్రమంలోనే నిర్మాతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే బన్నీ వాస్ నిర్మాతల పనితీరు కరెక్ట్ గా లేదని చెప్పారు. ఇప్పుడు తాజాగా నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా ప్రతి విషయంపై స్పందించే నాగవంశీ.. ఈ అంశంపై ఇన్ డైరెక్ట్ గా ట్వీట్ చేసినట్టు అర్థం అవుతోంది. అసలు తన ట్వీట్ లో ఎక్కాడా…
టాలీవుడ్లో ఇప్పుడు ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. థియేటర్ రెంటల్ లేదా పర్సంటేజ్ వ్యవహారం మీద చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రెండు రకాలుగా సినిమాలు రిలీజ్ చేస్తూ వచ్చారు. పెద్ద సినిమాలైతే రెంటల్ పద్ధతిలో, చిన్న సినిమాలు లేదా క్రేజ్ లేని సినిమాలైతే పర్సంటేజ్ పద్ధతిలో రిలీజ్ చేస్తూ వచ్చారు. కాకపోతే, మల్టీప్లెక్స్‌లలో మాత్రం ఏ సినిమా అయినా పర్సంటేజ్ ప్రకారమే రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్లు…
Pawan Kalyan : థియేటర్ల బంద్ విషయంలో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. హరిహర వీరమల్లు సినిమాను ఆపడానికే కుట్ర చేశారంటూ పెద్ద ఎత్తున పవన్ ఫ్యాన్స్ ఆరోపణలు చేశారు. చివరకు నిర్మాతల మండలి చర్చలు జరిపి థియేటర్ల మూసివేత ఉండట్లేదని.. యథావిధిగా సినిమాలు ఆడుతాయంటూ నిర్ణయం తీసుకుంది. నిర్మాతల మండలి ఈ ప్రకటన చేసిన కొద్ది క్షణాలకే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. సినిమా ఇండస్ట్రీ గౌరవ, మర్యాదలు కాపాడేందుకు తాము…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి విజయవంతమైన చిత్రాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన సందీప్ రెడ్డి వంగా, ఈ సినిమాతో ప్రభాస్‌ను పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవర్‌ఫుల్‌గా ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రం ప్రకటన వెలువడినప్పటి నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా హీరోయిన్…