AR Rahman : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి తెలిసిందే. ఆయనకు మన దేశంలోనే కాకుండా బయటి దేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఆయన్ను సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం ప్రశంసించారు. స్థానిక సింగపూర్ మ్యూజిక్ ఆర్టిస్టులతో కలిసి పనిచేసిందుకు గాను రెహమాన్ ను ఆయన పొగిడారు. రెహమాన్ డైరెక్షన్ లో వచ్చిన మల్టీ-సెన్సరీ వర్చువల్ రియాలిటీ చిత్రం ‘లే మస్క్’ను మే నెలలో సింగపూర్ లో పబ్లిష్ చేశారు. అందులో సింగపూర్ మ్యూజిక్ ఆర్టిస్టులు కొందరు పనిచేశారు.
Read Also : Shobha Shetty : వాటికి బ్రేక్ ఇచ్చిన శోభాశెట్టి.. అసలేం జరిగింది..?
అందుకే ఆయన్ను ప్రశంసించారు. ఇదే విషయాన్ని ఏఆర్ రెహమాన్ కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. భాషతో సంబంధం లేకుండా సరిహద్దులు దాటేసి మ్యూజిక్ ఎదుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రెసిడెంట్ ‘‘ప్రెసిడెంట్ ధర్మన్‌ను కలవడం గౌరవంగా ఉందని.. సింగపూర్ కళాకారులతో కలిసి మరోసారి పనిచేయడానికి వెయిట్ చేస్తున్నానని వివరించారు. ఆయన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏఆర్ రెహమాన్ ఇప్పుడు తెలుగు సినిమాలకు చాలా వరకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
Read Also : Kamal Haasan : ఏం మాట్లాడినా వివాదమే అవుతోంది.. కమల్ కామెంట్స్ పై రానా..