Bunny Vasu: కొట్టుకోవడం కాదు.. పెద్ద హీరోలు ఆలోచించాలి!
- టాలీవుడ్ సంక్షోభంపై నిర్మాత బన్నీ వాసు ట్వీట్
- ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా
- పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరోలు, ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్‌పై నెలకొన్న వివాదంపై ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ పునరాలోచించుకోవాల్సిన అసవరం ఉందన్నారు. పర్సంటేజ్ సిస్టమ్‌లో మార్పుల కోసం పోరాడటం కంటే.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు ఎలా రప్పించాలనే దానిపై దృష్టి సారించాలని సినీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. ఓటీటీ ట్రెండ్ ఇలానే కొనసాగితే రాబోయే 4-5 ఏళ్లలో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయని, ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలని బన్నీ వాసు ట్వీట్ చేశారు.
Also Read: Shubman Gill: ఆటగాళ్ల కెప్టెన్‌గా ఉంటా.. ప్రత్యేకమైన శైలి అంటూ ఏమీ లేదు!
Also Read
‘ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని. ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావుల, నాది పావలా అని కొట్టుకోవడం కాదు.. మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలి. ఇలాగ సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటీటీకి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే .. రాబోయే నాలుగైదు ఏళ్లలో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి. ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు రెండు సంవత్సరాలకు ఒక సినిమా, మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు. ఈ రెండు మూడేళ్లలో చాలా మంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. సింగిల్ స్క్రీన్స్ మూత పడినట్టైతే.. ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ మాత్రమే ఉంటాయి. పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మీ సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళుతుంది’ అని బన్నీ వాసు ట్వీట్ చేశారు.
ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని..! ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావుల.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు.. మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి…
— Bunny Vas (@TheBunnyVas) June 6, 2025
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!