స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘త్రిశంకు’. ప్రాచీ తెహ్లాన్, రష్మీ గౌతమ్ హీరోయిన్లు. సుమన్, మహేశ్ ఆచంట, నవీన్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని శ్రీకృష్ణ గొర్లె దర్శకత్వంలో లండన్ గణేశ్, నల్ల అయ్యన్న నాయుడు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం భాష్యశ్రీ రాయగా, సునీల్ కశ్యప్ ‘ఏడు రంగుల ఓ ఇంద్రధనస్సులా’ గీతాన్ని స్వరపరిచారు. దీనిని రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ లిరికల్ వీడియోను ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఇటీవల విడుదల చేసి, యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాతలు గణేశ్, అయ్యన్న మాట్లాడుతూ, ‘శ్రీకృష్ణ చెప్పిన కథ నచ్చి ఈ సినిమా నిర్మించాం. అన్ని వర్గాలను అలరించే చక్కని ఎలిమెంట్స్ మూవీలో ఉన్నాయి. అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు తెలియచేస్తాం’ అన్నారు.