బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది. అప్పటినుంచి ఈ బ్యూటీ తెలుగుల్లో నటించలేదు. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియా అభిమానులతో ముచ్చటించింది. కాగా టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఎప్పుడు ఉంటుందని ఓ తెలుగు అభిమాని ప్రశ్నించాడు. ఆమె స్పందిస్తూ.. ప్రస్తుతం తెలుగులో సినిమా కోసం రెడీ అవుతున్నట్లుగా తెలిపింది. ఈ విషయమై త్వరలోనే నప్రకటన ఉంటుందని చెప్పుకొచ్చింది. అయితే కియారా ఏ సినిమాలో నటిస్తుందనే దానికి మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఆమె కొరటాల శివ-ఎన్టీఆర్, రామ్ చరణ్-శంకర్, మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాల్లోని ఏ కాంబినేషన్ లో నటించనుందనే దానికి త్వరలోనే క్లారిటీ రానుంది.