ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ ప్రస్తుతం ‘శాకినీ – ఢాకినీ’ పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో టైటిల్ రోల్ ను రెజీనా కసెండ్రా, నివేదా ధామస్ పోషిస్తున్నారు. గతంలో ‘ఓ బేబీ’ చిత్రాన్ని నిర్మించిన సురేశ్ బాబు, తాటి సునీత, క్రాస్ పిక్చర్స్ సంస్థ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం. ‘ఓ బేబీ’ సినిమా కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ కాగా, ఇప్పుడు తీస్తున్న ‘శాకినీ – ఢాకినీ’ కూడా కొరియన్ సినిమా ‘మిడ్ నైట్ రన్నర్స్’కు రీమేక్. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ గతంలోనే మొదలైంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ పడింది. తిరిగి ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించామని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా తెలిపింది. రెజీనా, నివేదా ట్రైనీ పోలీసుల పాత్రల్లో కనిపించటం కోసం ప్రత్యేక శిక్షణ పొందటం విశేషం. ఎందుకంటే వారిద్దరు ఈ సినిమాలో కొన్ని స్టంట్స్ చేస్తున్నారట. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా ఇది రూపొందుతోంది. ఈ సినిమాను వీలయినంత త్వరగా విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.