రీమేక్ సాంగ్స్ పై దేవిశ్రీ ప్రసాద్ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ రాక్ చేస్తోంది. ‘పుష్ప’తో మరోమారు బాలీవుడ్ లోనూ మన మ్యూజిక్ డైరెక్టర్ దుమ్ము రేపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రీమేక్ లపై అభిప్రాయాలను పంచుకున్నాడు దేవిశ్రీ. అయితే బాలీవుడ్ లో సంగీత స్వరకర్తలకు తగిన క్రెడిట్ లభించలేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
రీమేక్‌ల మధ్య హిందీ సంగీత పరిశ్రమ శోభను కోల్పోయిందా ? అని ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ కు ప్రశ్న ఎదురైంది. ఈ విషయంపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ “నేను నిజంగా రీమిక్స్, రీమేక్‌లను ఇష్టపడను. వాస్తవానికి ఇది నా సూత్రం. పాటలను రీమేక్ చేయవద్దు. తెలుగు, తమిళంలో కూడా పాత పాటలను రీమేక్ చేయాలన్న సినిమాలను నేను తిరస్కరించాను. నేను రీమిక్స్‌లు చేయను. కానీ మళ్ళీ నా స్వంత పాటను రీమేక్ చేస్తున్నాను. ఇదెందుకు అంటే ఒక భాష నుండి మరొక భాష అనేది పాటను ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు” అని అన్నారు.
Also Read
Read Also : ‘రాధేశ్యామ్’ పోస్ట్ పోన్ పై మీమ్స్ హల్చల్!
“ఒక్క పాట కోసం స్వరకర్త నిజంగా చాలా కష్టపడతారు. సంగీతం అనేది మీరు ఒక్కరోజు మేల్కొని చేయగలిగినది కాదు. సంగీతం అనేది ఒక ఎమోషన్… కాబట్టి మీరు ఒక్క హిట్ సాంగ్ చేయడానికి మీ జీవితమంతా సంగీతంతోనే జీవించాలి. కాబట్టి ఎవరైనా జీవితాన్ని అంకితం చేస్తున్నప్పుడు, దానికి తగిన క్రెడిట్ సంగీత స్వరకర్తకే చెందుతుందని నేను భావిస్తున్నాను. ప్రతి చిత్రానికి ఒక సంగీత స్వరకర్త మాత్రమే ఉండేలా ఈ వ్యవస్థ మళ్లీ రావాలని కోరుకుంటున్నాను. ఒక వ్యక్తి దానిపై పని చేస్తుంటే సినిమాలో మొత్తానికి అతనే జవాబుదారీగా ఉంటాడు” అంటూ తన కోరికను వ్యక్తం చేశారు.
‘పుష్ప’లో సమంత నటించిన పెప్పీ నంబర్ ‘ఊ అంటావా ఉఊ అంటావా’ సాంగ్ వివాదంపై మాట్లాడుతూ సాంగ్ బాగాలేకపోయింటే ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదని అన్నారు. ఈ విషయంపై తాను రియాక్ట్ కాదల్చుకోలేదని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!