ఆర్జీవీ మరో సంచలన ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత వారం రోజులుగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలను పెంచాలనే డిమాండ్‌కు సపోర్ట్ చేస్తూ ఆర్జీవీ వార్తల్లో నిలిచారు. న్యూస్ ఛానల్ డిబేట్లలో పాల్గొని వరుస ట్వీట్లు కూడా పెట్టారు. ఆర్జీవీ చేసిన కొన్ని ట్వీట్లపై సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని కూడా స్పందించారు. చర్చకు సమయం కేటాయించాలని మంత్రిని ఆర్జీవీ కోరారు. ఎట్టకేలకు ఆర్జీవీకి మంత్రి అపాయింట్‌మెంట్ ఇచ్చారని ఆర్జీవీ స్వయంగా ట్విట్టర్‌లో ధృవీకరించారు. “జనవరి 10 మధ్యాహ్నం అమరావతి సచివాలయానికి గౌరవనీయులైన సినిమాటోగ్రఫీ మంత్రి నన్ను ఆహ్వానించారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఏపీ టికెట్ ధరపై సహృద్భావ పరిష్కారం కోసం మీ దయతో కూడిన చొరవకు ధన్యవాదాలు” అంటూ ఆర్జీవీ నిన్న ట్వీట్ చేశారు. తాజాగా ఆర్జీవీ మరో సంచలన ట్వీట్ చేశారు.
Read Also : హీరోయిన్లతో రిలేషన్… రానా పెళ్లిపై బాలయ్య కామెంట్స్
Also Read
“చలనచిత్రాలు, థీమ్ పార్కులు, సంగీత కచేరీలు, మ్యాజిక్ షోలు మొదలైనవి కూడా వినోద సంస్థల క్రిందకు వస్తాయి. వాటి టిక్కెట్ ధరలను కూడా ప్రభుత్వం నిర్ణయించలేదు” అంటూ ఆర్జీవీ మరో ట్వీట్ వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరో రెండ్రోజుల్లో సినిమా టికెట్ రేట్ల అంశంపై ఏపీ ప్రభుత్వాన్ని కలవనున్న ఆయన ఇప్పుడు ఇలా చిత్రపరిశ్రమతో పాటు మరిన్ని ఎంటర్టైన్మెంట్ షోలకు ప్రభుత్వం ధరలను నిర్ణయించలేదు అంటూ ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో ఆర్జీవీ టాలీవుడ్‌కి, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న గ్యాప్‌ని పూడ్చేస్తారా? అనే ఆసక్తి నెలకొంది టాలీవుడ్ ప్రేక్షకుల్లో !
For ur kind info like films, theme parks , music concerts , magic shows etc etc also come under entertainment enterprises ..Their ticket prices also are not fixed by the government
— Ram Gopal Varma (@RGVzoomin) January 8, 2022
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!