శ్రీ శుభకృత్ నామ సంవత్సరం… ఈరోజు తెలుగు వారికి మరో కొత్త సంవత్సరం ప్రారంభం. తెలుగు వారు సాంప్రదాయకంగా భావించే ఉగాది పండగను దక్షిణ భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో కొత్త సంవత్సరం ప్రారంభానికి గుర్తుగా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఉగాది పండుగ చైత్ర మాసం మొదటి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఉగాది ఏప్రిల్ 2, శనివారం వచ్చింది. ఈ పండగ సందర్భంగా ప్రజలు సంప్రదాయబద్ధంగా తమ ఇంటిని…
టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు శరత్ శుక్రవారం ఉదయం అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. తెలుగులో ఆయన దాదాపు 20 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘డియర్’ అనే నవల ఆధారంగా ‘చాదస్తపు మొగుడు’ అనే సినిమాతో ఇండస్ట్రీకి శరత్ పరిచయం అయ్యారు. బాలకృష్ణ, సుమన్ హీరోలుగా సినిమాలు తెరకెక్కించి భారీ విజయాలు సాధించారు. ఏఎన్నార్‌తో ‘కాలేజీ బుల్లోడు’, జగపతిబాబుతో ‘భలే బుల్లోడు’, బాలకృష్ణతో వంశానికొక్కడు, పెద్దన్నయ్య,…
గత శుక్రవారం పాన్ ఇండియా మూవీ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల కావడంతో మరో సినిమా గురించి ఎవరూ ఆలోచన చేయలేదు. టాలీవుడ్ లో అయితే ఈ మాగ్నమ్ ఓపస్ మూవీకి దారి వదులుతూ మిగిలిన వాళ్ళంతా ఒక వారం వెనక్కో ఓ వారం ముందుకో వెళ్ళిపోయారు. అయితే ఈ శుక్రవారం ‘ట్రిపుల్ ఆర్’ హంగామా సద్దుమణగడంతో మూడు సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. విశేషం ఏమంటే అందులో చెప్పుకోదగ్గది తాప్సీ కీలక పాత్ర పోషించిన ‘మిషన్ ఇంపాజిబుల్’.…
తాజాగా టాలీవుడ్ ప్రముఖులంతా తిరుమలలో సందడి చేశారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కే. రాఘవేంద్రరావు, సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, నిర్మాత బండ్ల గణేష్, వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు తిరుమల ఆలయానికి వెళ్ళారు. అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఒకేసారి ముగ్గురు టాలీవుడ్ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించడం విశేషం. అయితే అక్కడ ఉన్న భక్తులు వీరితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. వీరికి సంబంధించి ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో…
రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ సూపర్ డూపర్ హిట్‌తో అటు రామ్‌చరణ్, ఇటు ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ మూవీతో ఎన్టీఆర్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్లో పవన్ కళ్యాణ్, మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ యువ స్టార్ హీరోలుగా చలామణి అవుతున్నారు. ఈ హీరోలు వరుస విజయాలు సాధిస్తే టాలీవుడ్ పరిశ్రమకు వచ్చే కిక్కు అంతా ఇంతా కాదు. అయితే ఈ హీరోలు రెండేళ్లకు…
ప్రస్తుతం బాలీవుడ్ చూపు అంతా టాలీవుడ్ మీదనే ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఒక పక్క సినిమాలతో.. ఇంకోపక్క స్టైలిష్ మేకోవర్ తో టాలీవుడ్ హీరోలు.. బాలీవుడ్ ని మెస్మరైజ్ చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, తారక్, రామ్ చరణ్ లాంటి వారు ముంబై లో స్టైలిష్ మేకోవర్ లో కనిపిస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా లైగర్ బ్యాచ్ బాలీవుడ్ గ్రాండ్ పార్టీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు.…
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తాజా మూవీ ఆర్ఆర్ఆర్.. ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఇక, ప్రభుత్వం సినిమా టికెట్ల వివాదానికి తెరదింపుతూ కొత్త జీవోను విడుదల చేసిన నేపథ్యంలో.. ఇవాళ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు దర్శకుడు రాజమళి, నిర్మాత డీవీవీ దానయ్య.. సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాజమౌళి, దానయ్య.. మీడియాతో మాట్లాడారు.. సీఎం వైఎస్ జగన్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారన్నారు. ఆర్ఆర్ఆర్ భారీ బడ్జెట్…
తెలుగు ప్రేక్షకులతో పాటు దేశంమొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఆర్ఆర్ఆర్ మూవీ ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది.. ఇక, ఏపీలో ఇప్పటి వరకు టికెట్ల వివాదం కొనసాగగా.. తాజాగా ప్రభుత్వం ఆ వివాదానికి తెరదింపుతూ.. జీవో విడుదల చేసింది.. అందులో కొన్ని షరతులు కూడా పెట్టింది.. ఇప్పటికే చిరంజీవి సహా టాలీవుడ్ ప్రముఖులతో కలిసి సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన దర్శకుడు రాజమౌళి.. ఇవాళ ఆర్ఆర్ఆర్ మూవీ నిర్వాత డీవీవీ దానయ్యతో కలిసి.. సీఎం వైఎస్…
టాలీవుడ్‌కు మరో సీనియర్ నటుడు దూరమయ్యారు. ముత్యాల ముగ్గు ఫేం నటుడు పి.వెంకటేశ్వరరావు (90) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ ఈరోజు ఆయన కన్నుమూశారు. రంగస్థల కళాకారుడిగా పలు నాటకాల్లో నటించిన వెంకటేశ్వరరావు 1965లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన తేనెమనసులు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ఏడాదిలోనే మళ్లీ కృష్ణ నటించిన కన్నె మనసులు చిత్రంలో నటించారు. అయితే 1975లో లెజెండ్రీ డైరెక్టర్…
టాలీవుడ్ బ్యూటీ పూనమ్ కౌర్ చాలా రోజుల తరువాత “నాతిచరామి” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా త్వరలోనే ఓటిటిలో విడుదల కానుంది. మంగళవారం ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో పూనమ్ కౌర్ ఎమోషనల్ అయ్యింది. ఆ ఫోటోలను వాడుకుని కొంతమంది యూట్యూబర్లు తమ ఛానల్స్ లో థంబ్ నెయిల్స్ గా ఉపయోగించిన విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ “నాతిచరామి” టీమ్స్ వార్నింగ్ ఇచ్చింది. Read Also :…