టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కాంట్రవర్సీ అంతకంతకు ముదురుతోంది. విశ్వక్ సేన్- టీవీ యాంకర్ మధ్య జరిగిన సంభాషణ నెట్టింట వైరల్ గా మారిన విషయం విదితమే. డిబేట్ నడుస్తుండగా.. లైవ్ లో విశ్వక్, యాంకర్ ను అసభ్యకరమైన పదంతో ఆమెను దూషించడం, ఆ వీడియో కాస్త వైరల్ అవ్వడం, విశ్వక్ పై అందరు దుమ్మెత్తిపోయడం జరిగాయి. ఇక ఇటీవలే తన తప్పు తెలుసుకున్నానని, ఆ పదం అన్నందుకు సారీ చెప్తున్నానని మీడియా ముందే విశ్వక్ సారీ చెప్పాడు. ఇక దీంతో ఈ గొడవకు ఫుల్ స్టాప్ పడినట్లే అని అనుకున్నారు. అయితే ఈ ఒక్క వివాదం విశ్వక్ కెరీర్ ను నాశనం చేస్తుందా అంటే అవుననే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.
ఇక చిత్ర పరిశ్రమ నుంచి ఈ విషయం మంత్రి వరకు వెళ్ళింది. స్టూడియోలో తనను అందరి ముందు అవమానించాడంటూ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కి యాంకర్ ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయం ఇంకా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ విషయంపై తలసాని స్పందిస్తూ. ” నేనూ చూసాను.. విశ్వక్ రోడ్డుపై న్యూసెన్స్ చేయడం.. అతని ప్రవర్తన ఏమి బాగాలేదు. నా ఇష్టం వచ్చినట్లు చేస్తా.. రోడ్డు మీద ఫ్రాంక్ చేస్తా.. మెదిలాయి ముందు బూతులు మాట్లాడతా అంటే కుదరదు. అతనిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఈ విషయమై మా అసోసియేషన్ తో నేను మాట్లాడతాను” అని చెప్పుకొచ్చారు. ఇక ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న విశ్వక్ కి ఏ ఈ వివాదం సమస్య తెచ్చిపెట్టేటట్లే ఉంది. ఇక మా అసోసియేషన్ కనుక ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే విశ్వక్ పై బ్యాన్ తప్పదని పలువురు నొక్కివక్కాణిస్తున్నారు. మరి ముందు ముందు ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.