“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5″లో సెట్టూ అంటూ ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న బ్యూటీ శ్వేతా వర్మ. తాజాగా ఈ బ్యూటీకి ఓ చేదు అనుభవం ఎదురైందట. అదే విషయాన్నీ వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది శ్వేత. “చాలా బాధగా అన్పిస్తోంది. ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కు తీసేసుకున్నారు. నాకు ఇలా ఆశలు కల్పించి, వెంటనే ఆశలపై నీళ్లు చల్లడం ఏమైందా భావ్యమా? ఈ బాధను భరించలేకపోతున్నాను. నాకు ఇలా జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. ఒక వారం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను” అంటూ ఓ పోస్ట్ చేసింది. అయితే కాసేపటికే ఆ పోస్ట్ ను తొలగించేసింది.
Read Also : Mahesh Babu : ప్యారిస్ ట్రిప్… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఆల్బమ్
అప్పటికే శ్వేతా పోస్ట్ ను చూసిన వాళ్ళు దాన్ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, విషయం ఏంటా ? అని ఆరా తీస్తున్నారు. అసలు శ్వేతకు వచ్చిన ఆ ఛాన్స్ ఏంటి ? ఎవరిచ్చారు ? ఎందుకు వెనక్కి తీసుకున్నారు ? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వీటన్నింటికి శ్వేత దగ్గరే సమాధానాలు ఉన్నాయి. మరి అభిమానులకు అసలు విషయం ఏంటో ఈ బ్యూటీ చెప్తుందా ? లేదా అనేది చూడాలి.