యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సహా పలు నిర్మాణ సంస్థలలో సినిమా చేసేందుకు అడ్వాన్స్ తీసుకున్నారంటూ ఇటీవల మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ఈ వార్తలను ఖండిస్తూ, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. “డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ / డీవీవీ దానయ్య నుంచి ఎలాంటి అడ్వాన్సులు తీసుకోలేదు. ఈ ప్రచారం పూర్తిగా అబద్ధం, అర్థరహితం. మేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇరువర్గాల మధ్య ఎలాంటి ఒప్పందం…
హనుమాన్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు నిర్మాతల నుండి ఊహించని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ‘హనుమాన్’ వంటి అతి తక్కువ బడ్జెట్లో, అత్యంత నాణ్యమైన అవుట్‌పుట్‌ని ఇచ్చి పాన్ ఇండియా విజయాన్ని అందుకున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఆయన ప్రాజెక్ట్ అంటే చాలు పాన్ ఇండియా సినిమా కిందే లెక్క వేసేలా ఉంది పరిస్థితి. హనుమాన్ హిట్ అనంతరం ఆయన చేతిలో లెక్కలేనన్ని ప్రాజెక్టులు లైనప్ అవడంతో వరుస…
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ కానీ, ఇతర వివరాలు కానీ వెల్లడించలేదు. ఈ మధ్యనే మేము ఎక్స్‌క్లూజివ్‌గా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్ నవంబర్ 15వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నామని వెల్లడించిన సంగతి తెలిసింది. ఇప్పుడు ఆ ఈవెంట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. అదేంటంటే, ఈ నవంబర్ 15వ తారీఖున ఒక భారీ గ్లిమ్స్ రిలీజ్ చేయబోతున్నారని,…
సస్పెన్స్, థ్రిల్లర్ అనేది ఎప్పుడూ ఎవర్ గ్రీన్ జానర్. వృద్ధి స్టూడియోస్ పతాకంపై రవి హిరేమత్, రాకేష్ హెగ్గడే నిర్మాతలుగా సుకేష్ శెట్టి రచించి దర్శకత్వం వహించిన చిత్రం ‘పీటర్’. ఇందులో రాజేష్ ధ్రువ ప్రధాన పాత్రలో నటించగా, జాన్వి రాయల, రవిక్ష శెట్టి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. గురువారం నాడు మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ‘జెస్సీ మళ్లీ వచ్చింది.. డెవిడ్‌ను ఇక్కడకు తీసుకురా.. చెండే వాయిద్యం అంటే మాకు దైవంతో సమానం..…
Ram Charan’s ‘Peddi’ Movie First Song: రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పెద్ది’ మూవీ చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, నిర్మాత వెంకట సతీశ్ కిలారు.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నటీనటులు కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేంద్ర శర్మ తదితరులు కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ సినిమాపై తాజాగా బిగ్ అప్డెట్…
‘కాంతార’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా సూపర్ స్టార్ రేంజ్‌లోకి వెళ్లిన కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం దేశవ్యాప్తంగా 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. ఈ అద్భుత విజయంతో రిషబ్ శెట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. దీంతో ఆయన నటించే తదుపరి సినిమాలపై ప్రేక్షకుల్లో, ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే…
Baahubali The Epic : ప్రభాస్ హీరోగా వస్తున్న బాహుబలి రెండు పార్టులను ఒకే పార్టుగా బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న మూవీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే కదా. రెండు పార్టులను కలపడం అంటే చాలా సీన్లను తీసేయాలి. ఏయే సీన్లను డిలీట్ చేశారో అనే టెన్షన్ అటు ఫ్యాన్స్ లో కూడా ఉంది. ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్, రానా,…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మీ ప్రసన్న. నటిగా, ప్రొడ్యూసర్‌గా, టెలివిజన్ హోస్ట్‌గా ఎక్కడైనా తన స్టైల్, ధైర్యం, ఆత్మవిశ్వాసంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తె, హీరోలు మంచు విష్ణు, మంచు మనోజ్ సోదరి అయిన మంచు లక్ష్మీ, సినిమాలకే కాకుండా సామాజిక సేవల్లోనూ చురుకుగా పాల్గొంటుంది. అమెరికాలో చదువుకున్న మంచు లక్ష్మీ, తన కెరీర్‌ని హాలీవుడ్లో చిన్న పాత్రలతో ప్రారంభించింది. తర్వాత తెలుగు సినిమాల్లో అడుగు పెట్టి అనగనగా…
సినిమా రంగంలో నటిగా, సమాజ సేవలో తనదైన ముద్ర వేసిన అమల అక్కినేని ఇప్పుడు విద్యా రంగంలో కూడా తన ప్రతిభను చూపిస్తున్నారు. తాజాగా ఆమె అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా తరఫున మెక్సికోలో జరుగుతున్న CILECT కాంగ్రెస్ 2025లో పాల్గొంటున్నారు. ఈ కాన్ఫరెన్స్ అక్టోబర్ 27 నుండి 31 వరకు గ్వాడలజారాలో జరుగుతుంది. CILECT అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా, టెలివిజన్, మీడియా కాలేజీల సంఘం. ఇందులో సినిమా విద్య, సాంకేతికత, సృజనాత్మకత…
తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. బై 7PM , పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా సందీప్ అగరం, అశ్మితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 7న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, గ్లింప్స్, టైటిల్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో మంగళవారం…