The Family Man : ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్ విడుదలైనరోజు నుంచి ఏజెంట్ శ్రీకాంత్ తివారీ రూపం అంటే మనోజ్ బాజ్‌పాయియే గుర్తొస్తాడు. ఆయన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ఆ పాత్రను అంతగా ప్రేక్షకుల మనసుల్లో నాటేసింది. అయితే ఈ పాత్రకు మొదటి ఛాయిస్ మెగాస్టార్ చిరంజీవి అని చాలా మందికి తెలియదు. డైరెక్టర్ జంట రాజ్–డీకే ఈ కథను మొదట ఒక ఫుల్‌లెంగ్త్ సినిమా స్క్రిప్ట్‌గా రాసారట. ఆ కథను అశ్వనీదత్‌కు చెప్పగా ఆయనకు బాగా నచ్చింది. వెంటనే చిరంజీవిని కలిసి కథను వినిపించాడు.
Read Also : Mouni Roy : డైరెక్టర్ బలవంతంగా ముద్దు పెట్టాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
చిరంజీవికీ కథ బాగానే నచ్చినా.. ‘ఖైదీ నెం.150’ హిట్ కావడంతో ఇద్దరు పిల్లల తండ్రిగా నటించడం వద్దనుకున్నారు. రాజ్–డీకే అవసరమైతే పిల్లల పాత్రలను కథ నుంచి పూర్తిగా తీసేసి మూవీ చేద్దామని చెప్పినా ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ఆ తర్వాత వారు ఈ కథను వెబ్ ఫార్మాట్‌కు మార్చి మనోజ్ బాజ్‌పాయిని ఎంపిక చేశారు. ఈ వెబ్ సిరీస్ లో ముందు మనోజ్ నటించడానికి ఇష్టపడలేదు. కానీ కథ లోతు అర్థం చేసుకుని చేశాక.. ఆయనకు ఎన్నో ప్రశంసలు, అవార్డులు వచ్చాయి.
Read Also : Ravi Babu : ఆ పోస్టర్ చూసి నన్ను తిట్టారు.. రవిబాబు కామెంట్స్