Rajamouli : వారణాసి ఈవెంట్ లో హనుమంతుడి పై రాజమౌళి చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా వివాదానికి దారితీసాయి. ప్రపంచ మేటి దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. దేవుళ్లపై సినిమా తీస్తూ ప్రపంచానికి చాటి చెప్పాలి అనుకున్న జక్కన్న.. అదే దేవుడిపై కామెంట్ చేయటమే ఇక్కడ సెన్సేషన్. ఏకంగా రాజమౌళి పైనే కేసులు పెడుతున్నారు చాలామంది హిందూ సంఘాలు నేతలు. బిజెపి నేతలు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రాజమౌళి క్షమాపణలు చెప్పాలంటూ హనుమంతుడి భక్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో తీవ్రంగా రాజమౌళిని విమర్శిస్తూ వీడియోలు పెట్టేస్తున్నారు. ఇంత పెద్ద రచ్చ జరుగుతున్నా సరే రాజమౌళి ఇప్పటివరకు కనీసం స్పందించలేదు.
Read Also : Varanasi : విమర్శల వేళ.. మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన రాజమౌళి
అయితే తాజాగా వారణాసి ఈవెంట్ కు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశాడు జక్కన్న. అంత పెద్ద వివాదం తర్వాత రాజమౌళి నుంచి ఫస్ట్ టైం ఒక అప్డేట్ వచ్చింది. ఒక రకంగా ఇది రాజమౌళి స్పందన అనుకోవచ్చు. ఈవెంట్ కోసం తాను ఎంతగా కష్టపడ్డాను అనేది ఇందులో చూపించాడు. హీరో మహేష్ బాబు, మిగతా టీం మొత్తం ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఈవెంట్ జరిగిందో చూపించేలా వీడియోను రిలీజ్ చేశాడు. తాను అంత కష్టపడ్డాను కాబట్టే అనుకున్న టైం కు వీడియో ప్లే కాకపోవటం వల్ల అలా అసంతృప్తికి గురైనట్లు రాజమౌళి చెప్పకనే చెప్పాడు. అంటే దీన్నిబట్టి రాజమౌళి క్షమాపణలు చెప్పే ప్రసక్తి కనిపించట్లేదు. ఒకవేళ రాజమౌళి ఈ వివాదం మీద స్పందించాలి అనుకుంటే ఇలాంటి మేకింగ్ వీడియో మొదట పెట్టకుండా డైరెక్ట్ గా ఆయన స్పందిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేసేవాడు. లేదంటే కనీసం ట్వీట్ చేసేవాడు. అవేవీ చేయకుండా తన సినిమా అప్డేట్ ఇచ్చాడు అంటే ఈ వివాదం గురించి రాజమౌళి స్పందించాలని అనుకోవట్లేదని తెలుస్తోంది.
Read Also : Saudi Arabia: 73 ఏళ్లుగా మద్యం అమ్మని ముస్లిం దేశం.. కానీ ఇప్పుడు !