సంక్రాంతికి వస్తున్నాం సూపర్ సక్సెస్ తో జోష్ మీదున్న విక్టరీ వెంకి తన నెక్ట్స్ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వెంకీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలైనా నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరిలకు త్రివిక్రమ్ మాటల రచయితగా పని చేసాడు త్రివిక్రమ్. ఎప్పటినుండో సెట్ కావాల్సిన ఈ కాంబో అనేక వాయిదాల అనంతరం ఇప్పుడు లాక్ అయింది. ఎప్పటినుండో వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో సినిమా రావాలనుకున్న ఫ్యాన్స్ కోరిక నెరవేరింది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు త్రివిక్రమ్ స్టయిల్ ఆఫ్ కామెడీ, పంచ్ లతో సాగే కథ, కథానాలతో ఈ సినిమా తెరకెక్కబోతునట్టు తెలుస్తోంది.
కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను డిసెంబరు 15 నుండి మొదలు పెట్టనున్నారు. అందుకు సంబంధించి షెడ్యూల్ ప్లాన్ చేసి వర్క్స్ కూడా మొదలు పెట్టారు. షూటింగ్ స్టార్ట్ చేసి ఒకేసారి లాంగ్ షెడ్యూల్ లో మేజర్ పోర్షన్స్ ఫినిష్ చేయాలనీ ప్లాన్ చేసారు. ఈ షెడ్యూల్ లో సినిమాలో వచ్చే కీలక సన్నివేశాలను షూట్ చేయబోతున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాలో వెంకీ సరసన కన్నడ యంగ్ హాట్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. హారిక హాసిని బ్యానర్ పై సూర్యదేవర చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు వెంకట రమణ C/O ఆనంద నిలయం తో పాటు ‘అలివేలు వెంకటరత్నం’ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారట మేకర్స్. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలి ఎంటర్టైనర్ గా రాబోతున్న వెంకీ – త్రివిక్రమ్ సినిమా ఆడియెన్స్ ను నవ్వులతో ముంచెత్తడం ఖాయం.