జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మరియు సినీ వర్గాలకు కొంత ఆందోళన కలిగించే వార్త ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘దేవర’ ప్రాజెక్టులోని రెండవ భాగం, ‘దేవర: పార్ట్ 2’ నిలిపివేసే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ రూమర్లకు ప్రధాన కారణం, ఇటీవల విడుదలైన ‘దేవర: పార్ట్ 1’ చిత్రానికి లభించిన మిశ్రమ స్పందన. మొదటి భాగంపై అంచనాలు భారీగా ఉన్నప్పటికీ, కొంతమంది విమర్శకులు మరియు ప్రేక్షకుల నుంచి ఇది అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే, దర్శకుడు కొరటాల శివ ‘పార్ట్ 2’ కోసం సిద్ధం చేసిన కొత్త స్క్రిప్ట్ జూనియర్ ఎన్టీఆర్‌కు,
Also Read : Priyanka Chopra : ప్రియాంకా చోప్రా డబుల్ ధమాకా.. రాజమౌళి ‘వారణాసి’తో పాటు.. ఆ భారీ సీక్వెల్‌లో కూడా..?
అసంతృప్తి కలిగించిందని టాక్. ‘పార్ట్ 1’ ఫలితం దృష్ట్యా, ‘పార్ట్ 2’ స్క్రిప్ట్‌పై ఎన్టీఆర్ మరింత ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారని తెలుస్తోంది. దీంతో కొరటాల శివ అందించిన లేటెస్ట్ డ్రాఫ్ట్‌లో కొన్ని మార్పులు చేయాలని ఎన్టీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. డ్రాఫ్ట్ పూర్తిగా తిరస్కరించ పడకపోయినా.. కథలో మార్పులు అవసరమని ఎన్టీఆర్ భావించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఈ పుకార్లపై ‘దేవర’ చిత్ర యూనిట్ కానీ, ఎన్టీఆర్ కానీ, దర్శకుడు కొరటాల శివ కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
మనకు తెలిసి పెద్ద బడ్జెట్ సినిమాలలో, ముఖ్యంగా రెండు భాగాలుగా విడుదలయ్యే చిత్రాలలో, స్క్రిప్ట్ విషయంలో చివరి నిమిషంలో మార్పులు చేయడం అనేది సర్వసాధారణం. ‘పార్ట్ 1’ ఫలితాన్ని పరిగణనలోకి తీసుకుని, ‘పార్ట్ 2’ ను మరింత పకడ్బందీగా, ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు గా తీర్చిదిద్దడానికి మేకర్స్ సమయం తీసుకుంటున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించినప్పటికీ, ‘దేవర: పార్ట్ 2’ నిలిచిపోయే అవకాశం లేదని, అయితే స్క్రిప్ట్‌కు మరింత పదును పెట్టడానికి కొంత ఆలస్యం కావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ విషయంలో అధికారిక ప్రకటన వచ్చే వరకు, ఈ ఊహాగానాలను కేవలం రూమర్స్ గానే పరిగణించవచ్చు.