The Rajasaab : మారుతి డైరెక్షన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మూవీ ది రాజాసాబ్. సంక్రాంతి కానుకగా 9 జనవరి 2026లో రిలీజ్ కాబోతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగాఈ సినిమా నుంచి ఫ్యాన్స్ ఫెస్టివల్ పేరుతో నిర్వహించిన ఈవెంట్ లో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. రెబల్ సాబ్ అంటూ సాగే ఈ సాంగ్ యూత్ ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంది. ఇందులో ప్రభాస్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపించాడు. థమన్ అందించిన మ్యూజిక్ బాగానే ఆకట్టుకుంటోంది.
Read Also : Spirit : ప్రభాస్ ను దాచేస్తున్న వంగా.. కారణం అదే
చాలా కాలం తర్వాత ప్రభాస్ ను ఇలా ఫుడ్ సాంగ్ లో చూడటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్ బాగానే ఆకట్టుకున్న సంగతి మనకు తెలిసిందే కదా. ఇప్పుడు ఈ సాంగ్ తో మరింత హైప్ పెరగడం ఖాయం అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సాంగ్ లో ప్రభాస్ కాస్తంత స్పీడుగానే స్టెప్పులేసినట్టు కనిపిస్తున్నాడు. భారీ సెట్లు వేసి మరీ సాంగ్ షూటింగ్ చేసినట్టు కనిపిస్తోంది. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా రెబల్ సాబ్ సాంగ్ ను చూసేయండి.
Read Also : Mana Shankara Varaprasad Garu : అనిల్ రావిపూడి బర్త్ డే స్పెషల్.. చిరు సందడి చూశారా