గత 18 రోజులు గా జరిగిన సినీ కార్మికుల సమ్మెకు శుభం కార్డు పడింది. అనేక చర్చలు, వాదనలు, సవాల్ లతో గత పద్దెనిమిది రోజులుగా జరుగుతున్న టాలీవుడ్ సమ్మె విషయంలో చివరికి తెలంగాణ ప్రభుత్వం చొరవతో అందరికి ఆమోదయోగ్యమైన ఫలితం వచ్చింది. నిర్మాతలు , ఫెడరేషన్ నాయకుల తో కార్మికశాఖ అదనపు కమిషనర్ జరిపిన చర్చలు చర్చలు విజయవంతం అయ్యాయి. రెండు వేల లోపు కార్మికులకు మూడు సంవత్సరాలకు 22.5 శాతం వేతనాలు పెంచేలా నిర్ణయించారు.…
Tollywood: టాలీవుడ్‌లో సినీ కార్మికుల సమ్మె 15వ రోజుకు చేరుకుంది. షూటింగ్స్ పూర్తిగా ఆగిపోవడంతో సగటు కార్మికులు విలవిలలాడుతున్నారు. నిర్మాతలతో చర్చలు ఫలితమివ్వకపోవడంతో ఫెడరేషన్ నాయకులు ఒక పక్క చర్చలు కొనసాగిస్తూనే మరోపక్క నిరసనలకు దిగుతున్నారు. ఈ సమస్యల నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఫెడరేషన్ నాయకులు మెగాస్టార్ చిరంజీవిని కలవనున్నారు. అంతకు ముందు మధ్యాహ్నం 11 గంటలకు ఫెడరేషన్ కార్యాలయంలో కార్మిక సంఘాల సమావేశం జరగనుంది. నిన్న నిర్మాత సీ.కళ్యాణ్ కార్మిక సంఘాల సమస్యలపై…
టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో స్టార్ హీరోల సినిమాల నుండి డెబ్యూ హీరోల సినిమాల వరకు షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొన్ని స్టార్ హీరోల సినిమాలు ఈ నెలలో రిలీజ్ డేట్ వేసి వున్నాయి. కానీ బంద్ కారణంగా అవి కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. బంద్ మొదలైన రోజు ఒకటి రెండు రోజుల్లో అంతా నార్మల్ అవుతుందని భావించి రిలీజ్ డేట్స్ వేశారు నిర్మాతలు. కానీ ఇప్పటికి 14 రోజులుగా…
Tollywood : గత కొద్ది కాలంగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తమకు వేతనాలు పెంచాలని, అది కూడా 30% వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఫెడరేషన్ పెంచిన వారికి మాత్రమే షూటింగ్‌కు హాజరవుతామని ప్రకటించింది. అయితే, తదనంతర పరిస్థితులలో ఎవరూ షూటింగ్ జరపకూడదని ఫిలిం ఛాంబర్ ప్రకటించడంతో పూర్తిగా టాలీవుడ్ షూటింగ్స్ నిలిచిపోయాయి. అయితే, ఈ సమస్య పరిష్కారం కోసం గతంలోనే చిరంజీవి ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులతో భేటీ…
తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతన పెంపు డిమాండ్‌తో జరుగుతున్న సమ్మె వివాదంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్‌లో ప్రముఖ నిర్మాతలైన దిల్ రాజు, సుప్రియ, బాపినీడుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సినీ కార్మికుల సమ్మె, షూటింగ్‌ల నిలిపివేత వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. Also Read : Tollywood : ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రితో ముగిసిన నిర్మాతలు భేటీ.. నంది అవార్డ్స్ పై కీలక ప్రకటన సినీ కార్మికులు 30…
గత కోద్ది రోజులుగా టాలీవుడ్ లో బంద్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. తమకు 30 % వేతనాలు పెంచాలన్న కార్మిక సంఘాల డిమాండ్ కు నిర్మాతలు ససేమిరా అన్నాడంతో ఈ వివాదం మోదలైంది. దాంతో షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కాగా ఇప్పుడు ఈ వ్యవహారం ఆంధ్ర కు షిఫ్ట్ అయింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఏపి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు సమావేశం కానున్నారు. Also Read : Jr.NTR…
Bhatti Vikramarka : మధిర నియోజకవర్గ పరిధిలోని వంగవీడులో రూ. 630.30 కోట్ల వ్యయంతో జవహార్ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాన అతిథిగా పాల్గొనగా, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్‌రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రైతులు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని సాగర్ కాలువల నుంచి నీరు పొందాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. మధిర నియోజకవర్గంలో…
సినీ పరిశ్రమలో కార్మికులు, నిర్మాతల మధ్య కొనసాగుతున్న వివాదం మరోసారి వేడెక్కింది. ఫెడరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, నిర్మాతల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాతలు తమకు నచ్చిన సమయాల్లో, తమకు నచ్చిన వారితోనే పని చేయించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా, కొందరు నిర్మాతలు సినీ కార్మికుల నైపుణ్యాలను అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. Also Read : Tollywood strike: కృష్ణానగర్‌లో సినీ కార్మికుల సమ్మె మరింత…
టాలీవుడ్‌లో గత వారం నుంచి కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు మరియు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ, ఎటువంటి స్పష్టమైన పరిష్కారం దొరకకపోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ నేపధ్యంలో, కృష్ణానగర్‌లో 24 క్రాఫ్ట్ విభాగాలకు చెందిన వందలాది మంది కార్మికులు భారీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. Also Read : Tollywood strike : సినీ కార్మికుల 7వ రోజు సమ్మె అప్డేట్…
తెలుగు ఫిలిం ఫెడరేషన్ కార్మికులు తమ వేతనాలు, పారితోషికాలు 30% పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఆకస్మిక నిర్ణయం కారణంగా టాలీవుడ్‌లోని అన్ని షూటింగ్స్ ఒక్కసారిగా ఆగిపోవడంతో పరిశ్రమ మొత్తం స్తంభించి పోయింది. ఇతర భాషా ఫిల్మ్ ఇండస్ట్రీలతో పోలిస్తే ఇప్పటికే తెలుగు సినీ కార్మికుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయంటూ కొందరు నిర్మాతలు ఈ సమ్మెకు వ్యతిరేకంగా స్పందించగా, గత మూడు ఏళ్లుగా వేతనాల్లో పెంపు లేనందున ఈ డిమాండ్ సమంజసమేనని…