గత 18 రోజులు గా జరిగిన సినీ కార్మికుల సమ్మెకు శుభం కార్డు పడింది. అనేక చర్చలు, వాదనలు, సవాల్ లతో గత పద్దెనిమిది రోజులుగా జరుగుతున్న టాలీవుడ్ సమ్మె విషయంలో చివరికి తెలంగాణ ప్రభుత్వం చొరవతో అందరికి ఆమోదయోగ్యమైన ఫలితం వచ్చింది. నిర్మాతలు , ఫెడరేషన్ నాయకుల తో కార్మికశాఖ అదనపు కమిషనర్ జరిపిన చర్చలు చర్చలు విజయవంతం అయ్యాయి. రెండు వేల లోపు కార్మికులకు మూడు సంవత్సరాలకు 22.5 శాతం వేతనాలు పెంచేలా నిర్ణయించారు.
Also Read : Megastar : కన్నడ నిర్మాణ సంస్థలో చిరు – బాబీ.. నేడు స్పెషల్ పోస్టర్ రిలీజ్
రెండు వేల రూపాయల నుంచి ఐదు వేలరూపాయలు లోపు కార్మికులకు 17.5 శాతం మూడు సంవత్సరాలకు పెంచారు. ప్రొడ్యూసర్స్ అడుగుతున్న 9 టు 9 కాల్ షిట్ కు ఒకే చెప్పిన ఫెడరేషన్ నాయకులు. డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ కు కూడా వేతనాల పెంపుకు ఒప్పుకున్నారు నిర్మాతలు. పెద్ద బడ్జెట్ సినిమాలకు సండే లు 1.5 కాల్ షిట్, చిన్న సినిమాలకు సెకండ్ సండే నాలుగవ సండే 1.5 కాల్ షిట్, మిగతా సండే లు సింగిల్ కాల్ షిట్ ఉండేలా నిర్ణయించారు. దాంతో నేటి నుండి సినిమా షూటింగ్ లు ప్రారంభం అయ్యాయి. తెల్లవారు జామునుండే కృష్ణ నగర్ లో కోలాహలంగా మారింది. జూనియర్ అరిటిస్టులు ఇతర విభాగాలకు చెందిన టెక్నీషియన్స్ తో షూటింగ్స్ సందడి నెలకొంది. చివరి షెడ్యూల్ లో హాల్టింగ్ అయి ఉన్న సినిమాలు నేటి నుంచే షూటింగ్ షురూ చెసాయి. ఎక్కడ బ్రేక్ లేకుండా షూట్ చేసేలా ప్లాన్ చేసుకున్నారు కొందరు మేకర్స్. ఇదిలా ఉండగా నిర్మాతలు ఫెడరేషన్ నాయకుల చర్చలపై పై కొందరు సినీ కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేయడం కొసమెరుపు.