Tollywood strike: కృష్ణానగర్‌లో సినీ కార్మికుల సమ్మె మరింత ముదురుతున్న ఉద్రిక్తత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో గత వారం నుంచి కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు మరియు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ, ఎటువంటి స్పష్టమైన పరిష్కారం దొరకకపోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ నేపధ్యంలో, కృష్ణానగర్‌లో 24 క్రాఫ్ట్ విభాగాలకు చెందిన వందలాది మంది కార్మికులు భారీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read : Tollywood strike : సినీ కార్మికుల 7వ రోజు సమ్మె అప్డేట్
Also Read
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
- Varanasi Update: 'వారణాసి'లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
- world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. 'భోగి' టీజర్ రిలీజ్
ఈ నిరసనలో పలువురు నేతలు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఫైటర్స్ యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ – “మాకు స్కిల్ లేదని ఎలా అంటారు? స్కిల్ లేకపోతే ఇంతకాలం వందల సినిమాల్లో ఎలా పని చేసాం?” అని ప్రశ్నించారు. తాము ఎటువంటి అనవసర ఒత్తిడి చేయడం లేదని, కానీ తమ కష్టానికి తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వేతనాలు పెంచాలని అడిగితే కేసులు వేయడం సరికాదని వారు మండిపడ్డారు. “సినిమాల్లో వచ్చే లాభాల్లో వాటాలు అడగడం లేదు, కేవలం మా కష్టానికి సరిపడే వేతనం మాత్రమే కోరుతున్నాం” అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ సమ్మె కారణంగా అనేక సినిమా షూటింగ్‌లు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. పెద్ద సినిమాల నుంచి చిన్న బడ్జెట్ ప్రాజెక్టుల వరకు ప్రభావం చూపే అవకాశాలు కనబడుతున్నాయి. చర్చలు విఫలమైన ఈ దశలో, పరిశ్రమ భవిష్యత్తు ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్‌లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!