Tollywood strike : సినీ కార్మికుల 7వ రోజు సమ్మె అప్డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ఫిలిం ఫెడరేషన్ కార్మికులు తమ వేతనాలు, పారితోషికాలు 30% పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఆకస్మిక నిర్ణయం కారణంగా టాలీవుడ్‌లోని అన్ని షూటింగ్స్ ఒక్కసారిగా ఆగిపోవడంతో పరిశ్రమ మొత్తం స్తంభించి పోయింది. ఇతర భాషా ఫిల్మ్ ఇండస్ట్రీలతో పోలిస్తే ఇప్పటికే తెలుగు సినీ కార్మికుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయంటూ కొందరు నిర్మాతలు ఈ సమ్మెకు వ్యతిరేకంగా స్పందించగా, గత మూడు ఏళ్లుగా వేతనాల్లో పెంపు లేనందున ఈ డిమాండ్ సమంజసమేనని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే ఒకేసారి 30% పెంపు కష్టమని నిర్మాతల వర్గం స్పష్టం చేస్తోంది.
Also Read : Priyamani : బాలీవుడ్‌లో కలర్ బైయాస్‌పై ప్రియమణి సంచలన వ్యాఖ్యలు
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు – ఫిల్మ్ ఛాంబర్ మధ్య జరిగిన చర్చలు ఫలితం లేకపోవడంతో వివాదం మరింత ముదిరింది. కృష్ణా నగర్‌లో ఈ రోజు నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో 24 క్రాఫ్ట్ విభాగాల సభ్యులు పాల్గొననున్నారు. నిర్మాతల మండలి ప్రతిపాదన ప్రకారం, రోజువారీ వేతనం రూ.2,000 లోపు ఉన్న కార్మికులకు మొదటి ఏడాది 15%, రెండో ఏడాది 5%, మూడో ఏడాది 5% పెంపు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఈ పర్సెంటేజ్ విధానాన్ని ఫెడరేషన్ తిరస్కరించి, ఒకేసారి 30% పెంపు తప్ప మేం అంగీకరించమని స్పష్టం చేసింది.
ఫెడరేషన్ ప్రకారం, నిర్మాతలు కొన్ని యూనియన్లను విడదీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. “నిర్మాతల షరతులపై సుముఖంగా ఉన్నా, అవి దశలవారీగా కాకుండా వెంటనే అమలు కావాలి” అని ఫెడరేషన్ నేతలు చెబుతున్నారు. ఈ సమ్మెను మరింత ఉద్ధృతం చేయాలని, భవిష్యత్ కార్యాచరణను ఈ రోజు నిరసనలో ప్రకటించాలని యోచిస్తున్నారు. ఇక సోమవారం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి, నిర్మాతలు, ఫెడరేషన్ నేతల మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశం ఫలితంపై టాలీవుడ్ భవిష్యత్ షెడ్యూల్ ఆధారపడి ఉంది.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?