రాహుల్ సిప్లిగంజ్ నిన్న సీక్రెట్‌గా తన సుదీర్ఘ కాలపు ప్రేయసి హరిణ్య రెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అయితే, ఆమె ఒక పొలిటీషియన్ కుమార్తె అని ప్రచారం జరుగుతోంది. అయితే, అసలు ఆమె ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేయగా, కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె పేరు హరిణ్య రెడ్డి, యూసుఫ్‌గూడ సెయింట్ మేరీస్ కాలేజీలో బి.ఎ. మాస్ కమ్యూనికేషన్ ఇన్ జర్నలిజం చదివారు. తర్వాత, బిగ్ బాస్ నిర్వహించే ఎండేమోల్ షైన్ ఇండియా కంపెనీలో…
Chinmayi: చిత్ర పరిశ్రమలో సింగర్ చిన్మయి గురించి తెలియని వారుండరు. ఆడపిల్లకు కష్టం అని తెలిస్తే చాలా ఆదుకోవడానికి, ఆమె తరుపున గొంతు ఎత్తడానికి చిన్మయి ముందు వరుసలో ఉంటుంది.
Sravana Bhargavi: టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి ఎట్టకేలకు వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది. గత నాలుగు రోజులుగా ఆమెపై అన్నమయ్య భక్తులు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
Sravana Bhargavi: టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి సాంగ్ వివాదం ఇప్పుడప్పుడే ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఈ భామ భర్తతో విడిపోతున్నట్లు వార్తలు గుప్పుమనడంతో బయటికి వచ్చింది.భర్తతో విడిపోవడం పక్కన పెడితే ఈ రూమర్స్ వలన తన పేరు మారుమ్రోగిపోవడం బావుందని చెప్పి షాక్ ఇచ్చింది.
Sravana Bhargavi: టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి వివాదంలో చిక్కుకున్న విషయం విదితమే. అన్నమయ్య కీర్తనలో అసభ్యకరంగా నటించిందని ఆమెను నెటిజన్స్ ఏకిపారేస్తుండగా.. అన్నమయ్య భక్తులు ఆ వీడియోను డిలీట్ చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు చిత్రసీమలో ‘మాస్టారు’గా నిలచిన ఘంటసాల వేంకటేశ్వరరావును తలచుకున్న ప్రతీసారి తెలుగువారి మది పులకించి పోతూనే ఉంటుంది. తెలుగు సినిమా స్వర్ణయుగంలో ఘనవిజయాలు చూసిన చిత్రాలలో సింహభాగం ఆయన గళమాధుర్యంతో రూపొందినవే. ఇక ఆ నాటి మేటి నటులకు ఘంటసాల గానమే ప్రాణం పోసింది. అలాగే ఆయన స్వరకల్పన సైతం జనాన్ని పరవశింప చేసింది. తెలుగు సినిమాకు యన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్ళు అంటారు. ఆ రెండు కళ్ళలోనూ కాంతి నింపిన ఘనత ఘంటసాలదే! “ధారుణి రాజ్యసంపద…
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ అనారోగ్యంతో భాదపడుతున్న విషయం తెల్సిందే. ఇటీవల కరోనా బారిన పడిన ఆమె ముంబై హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలిసిందే. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ఇక లతాజీ ఆరోగ్యం అత్యంత విషమంగా మారిందని తెలియగానే ఆమె సోదరి, ప్రముఖ గాయని ఆశా భోస్లే హుటాహుటిన బ్రీచ్ కాండీ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్క ఆరోగ్య విషయమై చెల్లి ఆశా…
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ క్షీణించిందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని బ్రీచ్ కాండీ హాస్పిటల్ వైద్యులు ప్రతీత్ సమదాని శనివారం తెలిపారు. కోవిడ్-19 పాజిటివ్ అని తేలిన తర్వాత జనవరిలో లతా మంగేష్కర్‌ను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. అయితే అదే నెల 27న హాస్పిటల్ లో వెంటిలేటర్ తొలగించారని, ఆమె అడిగిన ప్రశ్నలకు బదులిస్తున్నారని, చేతితో సంజ్ఞలు చేస్తున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ ఈ రోజు పరిస్థితి…
ప్రముఖ యూట్యూబ్ ఛానెల్.. మ్యాంగో వివాదంలో చిక్కుకుంది. టాలీవుడ్ సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని ఆధ్వర్యంలో మ్యాంగో యూట్యూబ్ ఛానెల్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎంటర్ టైన్మెంట్ ప్రోగ్రామ్స్, సాంగ్స్ తో అలరించే మ్యాంగో యూట్యూబ్ ఛానెల్ తాజాగా వివాదంలో చిక్కుకొంది. మ్యాంగో యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసిన కొన్ని వీడియోలలో గౌడ మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారంటూ గౌడ కుల సంఘాలు ధ్వజమెత్తాయి. నేడు మ్యాంగో యూట్యూబ్ ఛానెల్ ఆఫీస్ పై వారు దాడికి పాల్పడినట్లు…