రాహుల్ సిప్లిగంజ్ నిన్న సీక్రెట్‌గా తన సుదీర్ఘ కాలపు ప్రేయసి హరిణ్య రెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అయితే, ఆమె ఒక పొలిటీషియన్ కుమార్తె అని ప్రచారం జరుగుతోంది. అయితే, అసలు ఆమె ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేయగా, కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె పేరు హరిణ్య రెడ్డి, యూసుఫ్‌గూడ సెయింట్ మేరీస్ కాలేజీలో బి.ఎ. మాస్ కమ్యూనికేషన్ ఇన్ జర్నలిజం చదివారు. తర్వాత, బిగ్ బాస్ నిర్వహించే ఎండేమోల్ షైన్ ఇండియా కంపెనీలో ఆమె ప్రొడ్యూసర్‌గా కూడా పనిచేసింది. వీరి ప్రేమ ఇప్పటిది కాదు, సుమారు 2020 అంతకు ముందు నుంచే వీరు ప్రేమలో ఉన్నట్లు సమాచారం.
Also Read: Coolie- War 2: ఇలా అయితే అస్సామే బాసూ?
ప్రతి ఏడాది మిస్ అవ్వకుండా రాహుల్ సిప్లిగంజ్ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ వచ్చాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సినిమాల్లో పూర్తిస్థాయి సింగర్‌గా స్థిరపడాలనే ఉద్దేశంతో రాహుల్ సిప్లిగంజ్ స్వయంగా తాను ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ ఫేమస్ అయ్యాడు. అలా చేస్తూ వచ్చిన ఆల్బమ్ సాంగ్స్ అన్నింటికీ రాహుల్ సప్లై సోదరుడు ఒక నిర్మాతగా వ్యవహరిస్తే, ఈ హరిణ్య రెడ్డి మరో నిర్మాతగా వ్యవహరిస్తూ వచ్చింది. అంటే, వీరిద్దరూ ఫేమస్ అవ్వడం కన్నా ముందే ప్రేమలో ఉన్నారని చెప్పొచ్చు. మొత్తం మీద, రాహుల్ సిప్లిగంజ్ నాటు నాటు దెబ్బకు ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకున్నాడు, ఆస్కార్ అవార్డులో భాగమయ్యాడు. మొత్తం మీద, వీరి ఎంగేజ్మెంట్ కూడా రాత్రి సైలెంట్‌గా నిర్వహించడం గమనార్హం.