టాలీవుడ్ లో సింగర్ సునీతకు ప్రత్యేకమైన పరిచయం అక్కడ్ర్లేదు. ఆమె వాయిస్ కి ఫిదా కానీ సంగీత అబిమాని లేడు అని అంటే అతిశయోక్తి కాదు. ఇక ఇటీవలే రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తని రెండో వివాహం చేసుకొని టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆమె కొత్త సంవత్సరం సందర్భంగా ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. “ఈ ఏడాది ఎన్నో సంఘటనలు…
ఎల్.ఆర్.ఈశ్వరి – ఈ పేరు ఆ రోజుల్లో ఎంతోమందికి ఉరకలు వేసే ఉత్సాహాన్ని నింపేది. ఎల్.ఆర్.ఈశ్వరి గళంలో జాలువారిన అనేక పాటలు తెలుగువారికి గిలిగింతలు పెట్టాయి. ఆమె పాడిన ఐటమ్ సాంగ్స్ అయితే జనాన్ని సీట్లలో కుదురుగా కూర్చోనీయలేదు. ‘ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్’ గా అప్పట్లో ఎల్.ఆర్.ఈశ్వరి గాత్రం జనంపై మత్తు చల్లి గమ్మత్తు చేసింది. ఈ నాటికీ ఆ నాటి ఎల్.ఆర్.ఈశ్వరి పాటలు విని పులకించిపోయేవారు ఎందరో ఉన్నారు. ఎల్.ఆర్.ఈశ్వరి పూర్తి పేరు లూర్దు మేరీ…
“ధారుణి రాజ్యసంపద మదంబున…” అంటూ ఆదికవి నన్నయ్య పలికించిన పద్యాన్ని, నటరత్న యన్.టి.రామారావు అభినయానికి అనువుగా ఆలపించినా, “కుడి ఎడమైతే… పొరబాటు లేదోయ్…” అంటూ నటసమ్రాట్ ఏ.నాగేశ్వరరావు నటనకు ప్రాణం పోసినా- వాటిలో తనదైన గళమాధుర్యం నింపుతూ ఘంటసాల వేంకటేశ్వరరావు సాగారు. ఘంటసాలను స్మరించిన ప్రతీసారి ఆ మహానటులిద్దరూ గుర్తుకు రాకమానరు. ఆ ఇరువురి అభినయాన్ని గుర్తు చేసుకున్న సమయాల్లో ఘంటసాల మాస్టర్ జ్ఞప్తికి రావలసిందే! నటరత్న, నటసమ్రాట్ అభినయవైభవంలో ఘంటసాల గానానికీ ప్రత్యేకమైన భాగముందని చెప్పవచ్చు.…