Sravana Bhargavi: టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి సాంగ్ వివాదం ఇప్పుడప్పుడే ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఈ భామ భర్తతో విడిపోతున్నట్లు వార్తలు గుప్పుమనడంతో బయటికి వచ్చింది.భర్తతో విడిపోవడం పక్కన పెడితే ఈ రూమర్స్ వలన తన పేరు మారుమ్రోగిపోవడం బావుందని చెప్పి షాక్ ఇచ్చింది. ఇక ఈ రూమర్స్ వేడిగా ఉన్నప్పుడే తన సాంగ్ రిలీజ్ చేస్తే మంచి ప్లస్ అవుతుందని అనుకున్నదో ఏమో తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఒకపరి కొకపరి అనే అన్నమయ్య కీర్తనను ఆలపించిన వీడియోను షేర్ చేసింది. ఇక ఈ సాంగ్ కాస్తా వివాదం అవ్వడంతో ఆమెకు లేనిపోని చిక్కులను తెచ్చిపెడుతోంది. ఇప్పటికే తిరుమల అన్నమయ్య ట్రస్ట్ సభ్యులు శ్రావణ భార్గవి కి వార్నింగ్ ఇవ్వడం, ఆ వీడియోను డిలీట్ చేయమని చెప్పడం జరిగింది. అలాంటి బెదిరింపులకు తాను లొంగనని, ఆ వీడియోలో ఎక్కడ అశ్లీలం ఉందో చూపించాలని ప్రశ్నిస్తూ వీడియో డిలీట్ చేసే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హాట్ టాపిక్ గామారిన ఈ వివాదంలోకి మరో వివాదస్పద నటి కరాటే కళ్యాణి ఎంటర్ అవ్వడం సంచలనంగా మారింది. ఇటీవలే కరాటే కళ్యాణి ఒక వివాదంలో చిక్కుకొని బయటికి వచ్చిన సంగతి తెల్సిందే.
ఇక తాజాగా శ్రావణ భార్గవి చేస్తోంది తప్పని, ఆ వీడియోను వెంటనే డిలీట్ చేయాలని ఆమె డిమాండ్ చేసింది. వీడియోలో ఎక్కడ అశ్లీలం ఉందని అడుగుతున్నావు.. నీకు పెళ్లి అయ్యింది.. వీడియోలో మెడలో తాళి లేదు.. కాళ్లకు మెట్టెలు లేవు, నుదిటిన బొట్టు లేదు.. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పెళ్లి అయిన మహిళ ఇవన్నీ ధరించాలి. ఆమె ఎందుకు ధరించలేదో నాకు తెలియదు. అవేమి లేకుండా కాళ్లు, చేతులు ఊపుతూ అన్నమయ్య కీర్తన ఆలపించాను అంటే కుదురుతుందా..? ముందు వాటిని పెట్టుకో.. వెంటనే శ్రావణ భార్గవి ఆ వీడియోను డిలీట్ చేయాలి.. లేదా కొన్ని సన్నివేశాలను అయినా తొలగించాలి అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా కె. విశ్వనాధ్, రాఘవేంద్ర రావు సినిమాలు చేసినప్పుడు ఇలా అడిగేవారు లేరు.. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు.. అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కరాటే కళ్యాణి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి కరాటే కళ్యాణి వ్యాఖ్యలపై శ్రావణ భార్గవి ఎలా స్పందిస్తుందో చూడాలి.