Singer Sunitha:సింగర్ సునీత గురించి సంగీత ప్రియులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె వాయిస్ తో మెస్మరైజ్ చేసి మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతుంది. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న సునీత కు ఒక కూతురు, కొడుకు ఉన్న విషయం తెల్సిందే. గత కొన్నిరోజుల నుంచి సునీత తన కొడుకు ఆకాష్ ను హీరోగా పరిచయం చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ నేడు తన కొడుకు ఆకాష్ ను హీరోగా పరిచయం చేస్తున్నట్లు సునీత ప్రకటించింది.
నేడు ఆకాష్ పుట్టినరోజు సందర్భంగా కొడుకుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ త్వరలోనే తన కొడుకు అతిపెద్ద స్టేజికి వెళ్తున్నాడని, అందరు ఆశీర్వదించాలని కోరింది. ఆకాష్ ఫోటోషూట్ ఫోటోలను షేర్ చేసింది. ఆకాష్ సైతం హీరో కటౌట్ తోనే బాగానే కనిపిస్తున్నాడు. ప్రేమకథలకు బాగా సెట్ అవుతాడని అంటున్నారు. అయితే ఈ కుర్రాడు ఏ సినిమా చేస్తున్నాడు.. ఏ బ్యానర్, డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరి సింగర్ సునీత తనయుడు ఏ డైరెక్టర్ చేతిలో పడతాడో చూడాలి.