మళ్ళీ ట్రాక్ లోకి చిరంజీవి చిన్నల్లుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’ తర్వాత పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. నిజానికి కరోనా ఫస్ట్ వేవ్ తగ్గగానే ఫస్ట్ తన సినిమా ‘సూపర్ మచ్చి’నే కళ్యాణ్ దేవ్ సెట్స్ మీదకు తీసుకెళ్ళాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ విడుదలకు సిద్ధంగా ఉంది. మధ్యలో దీనిని ఓటీటీలో విడుదల చేస్తారనే వార్తలూ వచ్చాయి. అలానే ‘కిన్నెరసాని’ సినిమా కూడా కళ్యాణ్ దేవ్ చేస్తున్నాడు. దీనిని ‘అశ్వద్ధామ’ ఫేమ్ రమణ తేజ్ తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచారు. ఇదే సమయంలో కళ్యాణ్ దేవ్, అవికా గోర్ జంటగా గీతా ఆర్ట్స్ 2, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి రచయిత శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్నాడు. ఇన్ని సినిమాలు సెట్స్ పై ఉండగానే మరో చిత్రానికి కళ్యాణ్ దేవ్ పచ్చజెండా ఊపేశాడు.
‘కథ కంచికి మనం ఇంటికి’ చిత్రాన్ని నిర్మించిన మోనిష్ పత్తిపాటి… కళ్యాణ్ దేవ్ హీరోగా ఓ సినిమాను మొదలు పెట్టారు. దత్తి సురేశ్ బాబు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ మూవీకి ఎం. కుమార స్వామి నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. కూకట్ పల్లిలోని తులసి వనంలో ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ రెగ్యులర్ షూటింగ్ ను అక్టోబర్ నుండి మొదలుపెడతామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. మొత్తానికి చిరంజీవి చిన్నల్లుడు నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తూ.. రైట్ టైమ్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఉంది.
Also Read
- Jailer 2 : 'జైలర్ 2'లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
- Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
- 'Dada' : 'దాదా' ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి