నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రంతో టాలీవుడ్ గేట్లను ఎత్తేసాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు బావుందని, బాలకృష్ణ స్టామినా చూపించారని తెలుపుతున్నారు. స్టార్ హీరోలు సైతం బాలయ్యబాబును పోగొడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా వీక్షించిన బాలకృష్ణ పెద్ద కూతురు నారా బ్రాహ్మణి తనదైన రీతిలో తన స్పందన తెలియజేసింది. “అఖండ సినిమా చూశాను.. చాలా అద్భుతంగా ఉంది.. అప్పుడు…
టాలీవుడ్ అడోరబుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత- నాగ చైతన్య జంట విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్ళ తరువాత విడిపోతున్నట్లు ప్రకటించడం అభిమానులకు షాక్ కి గురిచేసింది. ఇక ఈ నిర్ణయం వెనుక తప్పు ఎవరిది..? అని సోషల్ మీడియాలో వచ్చిన ప్రశ్నలకు ఏ ఒక్కరు సంధానం చెప్పలేదు.. విడాకుల తరువాత చైతు తన సినిమాలతో బిజీగా మారాడు .. మరోపక్క సామ్ కూడా డివోర్స్…
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు చిత్ర పరిశ్రమ తమ వంతు సాయం చేస్తూ ఉంటుంది.. ప్రకృతి వైపరీత్యాల వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు టాలీవుడ్ మొత్తం ఒక్కటిగా వారికోసం నిలబడతారు..ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో వరదల కారణంగా ఎన్నో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.. ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, చిత్తూరు ప్రాంతాలు వరద ధాటికి కొట్టుకుపోయాయి.ఈ విపత్తు కారణంగా కోట్లాది రూపాయలు నష్టపోయారు ప్రజలు, ప్రభుత్వం. వాళ్లను ఆదుకోడానికి ఏపీ గవర్నమెంట్ కూడా తమదైన సాయం చేస్తున్నారు. ప్రభుత్వానికి…
‘ఈ తరం పిక్చర్స్’ అధినేత పోకూరి బాబూరావు చిత్రాలను గుర్తు చేసుకుంటే, ఆయన అభిరుచి ఏమిటో ఇట్టే అర్థమై పోతుంది. ఆయన సినిమాల్లో అభ్యుదయ భావాలు దర్శనమిస్తాయి. సామాన్యుల పక్షం నిలచి, తన సినిమాల ద్వారా వారిలో ధైర్యం నింపిన పోకూరి బాబూరావు నైజం ఆకర్షిస్తుంది. కమర్షియల్ ఫార్ములా మిస్ కాకుండానే తన అభిరుచికి తగ్గ చిత్రాలతో పోకూరి బాబూరావు జనాన్ని ఆకట్టుకున్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలుకు సమీపంలోని త్రోవగుంట పోకూరి బాబూరావు స్వస్థలం. 1950 డిసెంబర్…
పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ భారీ అంచనాలను నెలకొల్పాయి. ఒక రీమేక్ చిత్రానికి ఇంతగా హైప్ రావడం భీమ్లా నాయక్ వలనే అయ్యిందంటే అతిశయోక్తి కాదు. మేకర్స్ కూడా అభిమానుల అంచనాలకు తగ్గట్టే సినిమాను…
బోయపాటి శ్రీనుకు మళ్లీ మంచిరోజులొచ్చాయి అని అంటున్నారు టాలీవుడ్ వర్గాలవారు. వినయ విధేయ రామ చిత్రంతో డిజాస్టర్ ని అందుకున్న బోయపాటి ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకొని తనకు విజయాలను తెచ్చిపెట్టిన బాలయ్యతో మూడో హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తన కసిని అంతా మాస్ యాక్షన్ గా మలిచి అఖండ లో చూపించాడు. అఖండ విడుదలై అఖండమైన విజయాన్ని అందుకుంది.. దీంతో బోయపాటి కల ఫలించి మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చాడు.…
నవతరం దర్శకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకొని సక్సెస్ రూటులో సాగిపోతున్నారు సురేందర్ రెడ్డి. తొలి చిత్రం ‘అతనొక్కడే’ మొదలు మొన్నటి ‘సైరా…నరసింహారెడ్డి’ దాకా తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యం చూపించే ప్రయత్నం చేశారు సురేందర్ రెడ్డి. కరీంనగర్ జిల్లా మాచంపల్లి సురేందర్ రెడ్డి స్వగ్రామం. 1975 డిసెంబర్ 7న సురేందర్ రెడ్డి జన్మించారు. ఆయన తండ్రి వీరారెడ్డి వారి గ్రామానికి సర్పంచ్ గా ఉండేవారు. సురేందర్ రెడ్డికి చిన్నప్పటి నుంచీ సినిమాలంటే…
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ పెళ్లి కూతురుగా మారుతున్న సంగతి తెల్సిందే.. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ని ప్రేమించిన అమ్మడు ఎట్టకేలకు వివాహంతో అతడి చెంతకు చేరనుంది. వీరి పెళ్లి అతికొద్ది బంధువులు.. ఇంకొంతమంది ప్రముఖల మధ్య ఈ నెలలో జరగనుంది. ఇప్పటికే రాజస్థాన్ లో క్యాట్- విక్కీల పెళ్ళికి అంతా సిద్ధమవుతున్నాయి. ఇక తాజగా ఈ జంట పెళ్లి పత్రికలను పంచే పనిలో పడ్డారంట .. చాలా ముఖ్యమైన గెస్టులను మాత్రమే కత్రినా పిలవనున్నదట..…
మెగాస్టార్ చిరంజీవి జోరు మాములుగా లేదు.. కుర్ర హీరోలతో సమానంగా కాదు కుర్ర హీరోల కంటే ముందే మెగాస్టార్ జోరుమీద ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలను ఏకకాలంలో పూర్తి చేస్తూ రికార్డ్ సృష్టించారు. ఇప్పటికే ‘ఆచార్య’ షూటింగ్ ని పూర్తీ చేసుకొని విడుదలకు సిద్దమవుతుంది.. ఈ సినిమా తరువాత మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ ని పట్టాలెక్కించారు.. ఈ షూటింగ్ మొదలుపెట్టిన కొద్దిరోజులకే యంగ్ డైరెక్టర్ బాబీ…
అల్లు అర్జున్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. ‘పుష్ప’ ట్రైలర్ ని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. కొన్ని సాంకేతిక కారణాలవలన ఆలస్యం అయ్యిందని చెప్పినా ఎట్టకేలకు అభిమానుల కోరిక మేరకు ట్రైలర్ ని విడుదల చేశారు. బన్నీ- సుకుమార్ కాంబోలో వస్తున్నా మూడో చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక ట్రైలర్ విషయానికొస్తే ఆద్యంతం ఉత్కంఠను…