బ్రేకింగ్: హీరో నానికి మద్దతు పలికిన దిల్ రాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరో నాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం టికెట్స్ రేట్స్ ని తగ్గించడంపై నాని తనదైన శైలిలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. టాలీవుడ్ లో ఐక్యత లేదు అని , వకీల్ సాబ్ సినిమా అప్పుడు మొదలైన ఈ సమస్యకు అప్పుడే పరిష్కారం వెతకాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. ఈ మాటలు ప్రస్తుతం టాలీవుడ్ చర్చనీయాంశంగా మారింది. నాని వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు పెదవి విరుస్తుండగా.. మరికొందరు ఆయనకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.
ఇక తాజాగా నాని వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు వివరణ ఇచ్చారు. నేడు శ్యామ్ సింగరాయ్ సక్సెస్ మీట్ కి అతిధిగా విచ్చేసిన దిల్ రాజు ఈ విషయంపై మాట్లాడుతూ ” ఇటీవల నాని చేసిన వ్యాఖ్యలను అందరు తప్పుగా అర్థం చేసుకున్నారు.. నాని చెప్పిన విషయం వేరు.. అది వెళ్లిన తీరు వేరు. నేను, నానితో చేసిన వి మూవీ ఓటిటీ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమా అప్పుడు కూడా నానికి, డిస్టిబ్యూటర్స్ కి గొడవ అయ్యింది. ఇలా రెండు సినిమాలు ఓటిటీ కి వెళ్లి వచ్చాకా ఇప్పుడు తన సినిమా థియేటర్లో రిలీజ్ కావడం, ఇలాంటి సమయంలో టికెట్ ఇష్యూ రావడం వలన, ఒక హీరోగా కష్టపడే మనస్తత్వంతో ఉన్న నాని ఎమోషనల్ అయ్యి అలా రియాక్ట్ అయ్యాడు.
Also Read
- Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
- Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
- Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
- SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే
తను చెప్పిన ఫీలింగ్ వేరు.. అందరికి కమ్యూనికేట్ అయిన విధానం వేరు. నాని చెప్పిన మాటల వెనుక ఉన్న ఆంతర్యాన్ని అర్ధం చేసుకున్నది ఎంతమంది.. సినిమాలకు , ప్రేక్షకులకు , ప్రభుత్వానికి మధ్య ఉన్న గోడ మీడియా.. మీరు ఏది చూపిస్తే అదే ప్రేక్షకులకు చూస్తారు. అలాంటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. నాని బాధ వేరు.. రెండు సినిమా ల తరువాత వస్తున్నా సినిమా కాబట్టి ఆ మాత్రం రియాక్ట్ కావాల్సిన అవసరం తనకుంది. అందుకే తను రియాక్ట్ అయ్యాడు.. అంతేకాని నెగెటివ్ గా రిచ్ అయ్యేలా మాత్రం నాని మాట్లాడలేదు.. అర్ధం చేసుకోండి” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దిల్ రాజు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
-
Fake Doctors: హైదరాబాద్‌లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
-
YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
-
Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
-
Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!