Miss. Shetty Mr. Polishetty: టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నేళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అనుష్క ప్రస్తుతం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోగా నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు.
BiggBossTelugu7: వచ్చేసింది.. వచ్చేసింది.. అందరు ఎదురుచూస్తున్న బిగ్ బాస్ మళ్లీ అందరి ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పటివరకు ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్ బాస్ .. ఇప్పుడు ఏడవ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అసలు ఎప్పుడో బిగ్ బాస్ మొదలుకావాల్సి ఉండగా.. కొన్ని కారణాలవలన ఆలస్యమయింది.
KGF: ఇండియన్ సినిమా రేంజ్ రోజురోజుకు పెరిగిపోతుంది. సౌత్ సినిమాల వైపు ప్రపంచమే తొంగిచూస్తోంది. పాన్ ఇండియా రేంజ్ కాస్తా.. పాన్ ఇండియా వరల్డ్ గా మారిపోతుంది. అందుకు కారణం దర్శకధీరుడు రాజమౌళి అని చెప్పఁడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. బాహుబలి తో దేశాన్ని.. ఆర్ఆర్ఆర్ తో ప్రపంచాన్ని జయించాడు.
Brahmaji: నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా.. ఇలా పాత్ర ఏదైనా.. బ్రహ్మాజీ ఇచ్చి పడేస్తాడు. కేవలం సినిమాలో మాత్రమే కాదు.. బయట కూడా ఆయన కామెడీ టైమింగ్ వేరే లెవెల్ అని చెప్పాలి. ప్రెస్ మీట్స్, ఇంటర్వూస్, చిట్ చాట్ సెషన్స్, బుల్లితెర షోస్.. ఎందులో అయినా బ్రహ్మాజీ ఉన్నాడు అంటే కామెడీకి కొదువలేదు అని మాత్రం పక్కాగా చెప్పొచ్చు.
Jawan: ప్రస్తుతం సోషల్ మీడియాను జవాన్ ఆక్రమించేశాడు. ఉదయం నుంచి జవాన్, షారుఖ్, అట్లీ, నయన్ తార, దీపికా పదుకొనె, విజయ్ సేతుపతి అనే పేర్లే వినిపిస్తున్నాయి తప్ప మరి ఇంకేం పేర్లు వినిపించడం లేదు. దానికి కారణం నేడు జవాన్ ప్రివ్యూను రిలీజ్ చేయడమే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది.
SS.Thaman: చిత్ర పరిశ్రమ.. ఎన్ని ప్రశంసలను అయితే ఇస్తుందో.. అంతే విమర్శలను అందిస్తుంది. ఒక సినిమా బావుంటే ఆకాశానికి ఎత్తినవారే.. మరో సినిమా బాగోలేకపోతే అధఃపాతాళానికి తొక్కేస్తారు. ఇక్కడ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం చాలా కష్టం. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లే కాదు.. హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్లు సైతం ట్రోల్స్ కు గురవుతున్నారు.
Hayley Atwell: సినిమా రంగంలో హీరో హీరోయిన్ల మధ్య కొద్దిగా రొమాన్స్ హద్దు దాటితే బయట కూడా వారి మధ్య ఏదో ఉందని చెప్పుకొస్తారు. ఇలాంటి రూమర్లు ప్రతి హీరోయిన్ ఎదుర్కొనేదే. దానికి భాషతో సంబంధం లేదు. హాలీవుడ్ లో కూడా ఇలాంటి రూమర్స్ కు కొదువే లేదు. ఒక హీరోయిన్.. తనకన్నా ఏజ్ లో పెద్ద అయినా హీరోతో రొమాన్స్ చేస్తే .. బయట కూడా శృంగారంలో పాల్గొంటుంది అని పుకార్లు పుట్టించేస్తున్నారు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఒకపక్క సినిమాలు చేస్తూనే ఇంకోపక్క వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగా మారాడు. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా కూడా కుటుంబంతో కలిసి సమయాన్ని గడుపుతుంటాడు.
Ram Gopal Varma: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం అమెరికాలో రచ్చ చేస్తున్నాడు. నాటా సభల కోసం అమెరికా వెళ్ళిన వర్మ అమెరికాను దున్నేస్తున్నాడు. చూడాల్సిన ప్లేస్ లు, కలవాల్సిన మనుషులును కలుస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు.
Shivathmika Rajashekar: యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్- జీవిత గారాలపట్టి శివాత్మిక రాజశేఖర్. దొరసాని సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి నటనను కనబరిచి ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత శివాత్మికకు వరుస ఆఫర్లు వస్తాయి అనుకుంటే.. అంతంత మాత్రంగానే అందుకుంది.