Sarayu:బిగ్ బాస్ రియాల్టీ షో కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఏడవ సీజన్ కు రెడీ అయింది. ఇప్పటికే నాగ్ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సీజన్లో స్టార్ కంటెస్టెంట్లను దింపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి కొందరు అభిమానులు ఇది రియల్ అంటే.. ఇంకొంతమంది ఫేక్ అంటూ కొట్టుకుంటూనే ఉన్నారు. ఇక తాజాగా బిగ్ బాస్ నిజంగానే ఫేక్ అంటూ పాత బిగ్ బాస్ కంటెస్టెంట్ సరయు చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సరయు అనగానే.. గుర్తొచ్చేది బూతు డైలాగులు, వల్గర్ పంచులు. యూట్యూబ్లో సెవెన్ ఆర్ట్స్ ఛానల్లో వెబ్ సిరీస్ లు, షార్ట్ వీడియోలు చేస్తూ రెచ్చిపోయే సరయు బిగ్ బాస్ నాలుగో సీజన్లో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇంట్లోకి వచ్చిన మొదటి వారం రోజులకే ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించేశారు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ఓటిటీలో మరోసారి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా నాలుగు వారాల కంటే ఎక్కువ ఉండలేకపోయింది. ఇప్పుడు ఏడవ సీజన్ మొదలవుతున్న సందర్భంగా ఆమె బిగ్ బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
Thiruveer: మాసూద హీరోతో జీ5 ‘మిషన్ తషాఫి’…
బిగ్ బాస్ మాత్రమే కాదు అన్ని రియాల్టీ షోలు ఫేక్ అంటూ తేల్చి చెప్పేసింది. ” ఈ రియాల్టీ షో లు అన్ని ఫేక్. వాళ్ళే డబ్బులు ఇచ్చి లేదా వాళ్ళని కొనుక్కొని వాళ్లకు కావాల్సిన వాళ్ళని ప్రమోట్ చేసి గెలిపిస్తారు. దాన్ని రియాల్టీగా ప్రేక్షకులకు చూపించి జనాలందరిని పిచ్చోళ్లను చేస్తున్నారు. దయచేసి ఇలాంటి రియాల్టీ షోలు చూడకండి. మీ టైం వేస్ట్ చేసుకోకండి” అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఇలా చెప్పడానికి కారణం కూడా ఉందని తెలిపింది. “నేను బిగ్ బాస్ కి వెళ్ళాను కాబట్టి ఈ మాట చెప్తున్నాను. అక్కడికి వెళ్ళినంత వరకు నేను కూడా మీలాగే అనుకున్నాను. అంతకుముందు ఉద్యోగం చేసామా..? ఇంటికి వచ్చామా..? యూట్యూబ్ వీడియోలు చేస్తున్నామా.. ? అదే నా జీవితంలో ఉండేది. కానీ, ఆ హౌస్ లోకి వెళ్ళాక అక్కడ జరిగింది చూసి నేను కూడా షాక్ అయ్యాను. కొంతమందికి బయట నుంచే కాకుండా లోపల కూడా సపోర్ట్ ఉండేది. వారి దగ్గర కాన్ఫిడెన్స్ వేరేలా ఉండేది. అలాంటి వాళ్ళతో పోరాటం చేయడం చాలా కష్టం. నిజం చెప్పాలంటే వాళ్లతో ఫైట్ చేస్తే మనమే నెగిటివ్ అవుతామని నాకు అర్థమైంది. దానివల్ల నేను చాలా ఒత్తిడికి గురయ్యేదాన్ని. అందుకే చెప్తున్నాను ఇదంతా ఫేక్” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.